India vs china education system: అమెరికాను దాటడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్న చైనా.. దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తోంది. తయారీ రంగంలో కనివిని ఎరుగని స్థాయిలో విప్లవాత్మకమైన మార్పులను చేపడుతోంది. మౌలిక సదుపాయాలు అభివృద్ధికి అంతకుమించి అనే రేంజ్ లో కృషి చేస్తోంది. ఇక విద్యారంగం విషయంలోనూ చైనా అమెరికాను మించిపోతోంది. ఒక దేశం బాగుపడాలంటే.. అక్కడి యువతరంలో అద్భుతమైన మేధో సంపత్తి ఉండాలి. దానిని గుర్తించిన చైనా విద్య మీద ఎక్కువగా దృష్టి సారిస్తోంది. సాంకేతిక విద్య, వృత్తివిద్య విభాగాలలో అధునాతనమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రపంచ స్థాయిని మించి పాఠశాలలు, కళాశాలలో నిర్మించి ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. ఆ స్థాయిలో సదుపాయాలు కల్పించినప్పటికీ విద్యార్థులకు ఉచితంగానే విద్యను అందిస్తోంది.
Also Read: భారత్‌కన్నా అమెరికాకే ఎక్కువ నష్టమా!
మౌలిక సదుపాయాలు, చదువు పూర్తిగా గానే ఉపాధి లభించే విధంగా పూర్తిగా విద్యావ్యవస్థను మార్చేసింది చైనా. కేవలం నగరాలు, రాజధాని, ఇతర పట్టణాలు మాత్రమే కాకుండా మారుమూల ప్రాంతాలలో కూడా అధునాతన సదుపాయాలతో విద్యాలయాలు నిర్మించింది. పూర్తిగా డిజిటల్ విధానంలో విద్యాబోధన చేస్తోంది. విద్యార్థులకు బ్లాక్ బోర్డ్, చాక్ పీస్ విధానం కాకుండా.. రీడ్, లెర్న్ అనే విధానంలో విద్యాబోధన సాగిస్తోంది. అందువల్లే చైనాలో విద్యా ప్రమాణాలు అత్యున్నతంగా ఉంటున్నాయి. ఉదాహరణకు హయ్యర్ స్టడీస్ కు ఇతర దేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో చైనా ముందు ఉన్నది. అయితే ఇది తమ దేశానికి ఏమాత్రం మంచిది కాదని భావించిన పాలకులు.. గత కొన్ని సంవత్సరాలుగా విద్య మీద విపరీతంగా దృష్టి సారించారు. భారీగా ఖర్చు పెడుతూ.. అధునాతనమైన విద్యాలయాలను నిర్మిస్తున్నారు. అందువల్లే కొన్ని సంవత్సరాలుగా అక్కడ విద్యా విధానాల్లో మార్పులు వచ్చాయి. ఫలితంగా విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని చైనా పాలకులు చెబుతున్నారు.
Also Read: పాక్ క్షిపణులు తుస్.. అట్టర్ ఫ్లాప్.. జనాల మీదే పడ్డాయి
చైనా లో అధునాతన పాఠశాలలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మనదేశ విద్యా విధానానికి సంబంధించిన చర్చ నడుస్తోంది.. మనదేశంలో విద్యా విధానంలో ఇప్పటికీ ఒక ప్రణాళిక అంటూ లేదు. సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలోనే చదివిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలపై ప్రభుత్వాలకు అజమాయిషి కొరవడిన నేపథ్యంలో విద్య అనేది వ్యాపారంగా మారింది. పైగా ప్రభుత్వాలను శాసించేస్తాయికి ప్రైవేట్ విద్యాసంస్థలు ఎదిగాయి. దీంతో విద్య అనేది ఒక అంగడి సరుకులు లాగా మారిపోయింది. ఇక ప్రభుత్వ విద్యాలయాలలో పనిచేస్తున్న సిబ్బందికి చిత్తశుద్ధి లేకపోవడంతో.. అక్కడ విద్యాబోధన అత్యంత నాసిరకంగా ఉంటున్నది. మనదేశంలో చదువుకున్న తర్వాత ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉండడంతో చాలామంది విదేశాలకు వెళ్తున్నారు. విదేశాలలో ఉన్నత చదువులు చదివి.. అక్కడి కంపెనీలలో పనిచేస్తున్నారు. తద్వారా మేథో శక్తి మొత్తం విదేశీ కంపెనీల పాలవుతోంది. భారతీయుల మేథను ఉపయోగించుకొని విదేశీ కంపెనీలు దండిగా సంపాదిస్తున్నాయి. చైనాను చూసిన మన ప్రభుత్వాలు విద్యా విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలని విద్యావేత్తలు కోరుతున్నారు. చైనాలో ఉచిత విద్య ఆ స్థాయిలో లభిస్తుంటే.. మన దగ్గర మాత్రం మరో వందేళ్లలో కూడా సాధ్యమయ్యే పని లాగా అనిపించడం లేదని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.