Anchor Sreemukhi Marriage: తెలుగు బుల్లితెరపై సుమ తర్వాత ఆ రేంజ్ లో ప్రోగ్రామ్స్ చేస్తూ స్టార్ యాంకర్ గా గుర్తింపు పొందింది శ్రీముఖి. బుల్లి తెరపై తనదైన టైమింగ్, కామెడీ పంచ్ లతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. పర్ఫార్మెన్స్ కు తన గ్లామర్ ను యాడ్ చేసి యాంకరింగ్ కు సరికొత్త విధానాన్ని నేర్పింది. ఆమె చేసిన పటాస్ షో ద్వారా ఆమెకు ఎక్కువగా పేరు వచ్చింది. యాంకర్ కాక ముందే కొన్ని సినిమాల్లో నటించినా.. పెద్దగా గుర్తింపు రాలేదు.

కానీ ఎప్పుడైతే బుల్లి తెరపై అడుగు పెట్టిందో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. పటాస్, మనీ మనీ, కామెడీ నైట్స్, బొమ్మ అదిరింది లాంటి షోలలో ఆమె హోస్ట్ గా చేసింది. వీటిలో ఎక్కువగా ఆమెకు పటాస్ షో ద్వారానే పేరు వచ్చింది. మల్లెమాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన షోల ద్వారానే ఆమె పాపులర్ అయింది. ఇక బిగ్ బాస్-3 షో ద్వారా ఆమెకు అన్ని వర్గాల్లో క్రేజ్ ఏర్పడింది. ఈ షోలో ఆమె విన్నర్ అవుతుందని అంతా అనుకున్నారు. రన్నరప్ గా నిలిచినా అందరి మన్ననలు పొందింది.
శ్రీముఖి ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు పూర్తి కావస్తోంది. కానీ ఇప్పటివరకు ప్రేమ, పెళ్లి అనే వాటికి దూరంగా ఉంటుంది. అయితే తాను ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందో అనే విషయంపై ఇప్పటి వరకు ఎప్పుడూ నోరు విప్పలేదు. కానీ శ్రీరామనవమి సందర్భంగా క్యాష్ ప్రోగ్రాంలో స్పెషల్ షో నిర్వహించారు. తాజాగా ఈ షో కు సంబంధించి ప్రోమోను వదిలారు. ఇందులో హోస్ట్ గా చేస్తున్న సుమ అడిగిన ప్రశ్నకు శ్రీముఖి ఆసక్తికర విషయాలు చెప్పింది.

ఈ సందర్భంగా తాను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్నా ఎవరిని ప్రేమించకుండా సింగిల్ గా ఉండి పోయానని.. తాను పెళ్లి చేసుకోకపోవడానికి అతనే కారణం అంటూ చెప్పబోయింది. ఈ సమయంలో షో నిర్వాహకులు లవ్ సింబల్స్ కూడా వేశారు. కాగా దీన్ని అక్కడితోనే కట్ చేశారు. శ్రీముఖి ఎవరి పేరు చెబుతుందో అనేది ఫుల్ ఎపిసోడ్ వస్తే మాత్రం తెలియదు. అయితే బిగ్ బాస్ షో లో పాల్గొన్నప్పుడు తాను ఒక అబ్బాయిని ప్రేమించినట్టు చెప్పింది. కానీ అతనితో బ్రేకప్ అయ్యిందని, అతను చాలా పాపులర్ వ్యక్తి అని అందరికీ తెలిసిన మనిషి అంటూ హింట్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఎవరి పేరు చెబుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.