Anchor Soumya Rao: జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యరావు వేదిక మీద ఏడ్చేశారు. తల్లిని తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఆమె జీవితంలో ఉన్న విషాదం శ్రీదేవి డ్రామా కంపెనీ షో వేదికగా బయటపడింది. కమెడియన్ హైపర్ ఆది యాంకర్ సౌమ్యరావుకు గిఫ్ట్ గా ఓ ఫోటో ఇచ్చాడు. ఆ ఫోటో చూసి సౌమ్యరావు ఎమోషనల్ అయ్యారు. కన్నీరు ఆపుకోలేకపోయారు. కారణం… అది సౌమ్యరావు మదర్ ఫోటో. చివరి రోజుల్లో సౌమ్యరావు మదర్ నరకవేతన అనుభవించారట. ఈ విషయాన్ని సౌమ్యరావు వేదిక సాక్షిగా అందరితో పంచుకున్నారు.
ఒకరోజు అమ్మకు బాగా తలనొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే పరీక్షలు చేసి బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారు. మూడేళ్లు అమ్మ బెడ్ పై నరకయాతన అనుభవించారు. దేవుడు ఆమెకు అంత కఠినమైన చావు ఇస్తారని అనుకోలేదు. నాది ఒకటే కోరిక, నా కడుపున మా అమ్మ పుట్టాలి, అని కన్నీరు పెట్టుకుంది. సౌమ్యరావు విషాదగాథ విన్నవారందరూ కన్నీరు పెట్టుకున్నారు. సౌమ్యరావు జీవితంలో ఇంత విషాదం దాగి ఉందా? అని చలించిపోతున్నారు.
అనసూయ యాంకరింగ్ మానేయడంతో సౌమ్యరావుకు జబర్దస్త్ షో ఛాన్స్ దక్కింది. గత ఏడాది ఆమె ఎంట్రీ ఇచ్చారు. సౌమ్యరావు జబర్దస్త్ షోలో తన మార్క్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గ్లామర్, కామెడీ పరంగా అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సౌమ్యరావు పేరు జనాల్లో ఇంకా రిజిస్టర్ కాలేదు. అనసూయ మాదిరి ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాలేకపోతున్నారు. అందులోనూ జబర్దస్త్ కి ఒకప్పుడు ఉన్నంత ఆదరణ లేదు.
సౌమ్యరావు కన్నడ అమ్మాయి. సీరియల్ నటిగా చేశారు. కొన్నాళ్ళు న్యూస్ రిపోర్టర్ గా కూడా చేసినట్లు సమాచారం. ఎందరో జబర్దస్త్ యాంకర్ పొజిషన్ కోసం పోటీపడుతుంటే ఆ ఛాన్స్ సౌమ్యరావుకు దక్కింది. సౌమ్యరావుకు తెలుగు కూడా అంతగా రాదు. ఇక రెమ్యూనరేషన్ తక్కువగానే ఇస్తున్నారట. రష్మీ, అనసూయలతో పోల్చుతుంటే సౌమ్యరావుకు నిర్మాతలు తక్కువ మొత్తం చెల్లిస్తున్నారని సమాచారం. ఎపిసోడ్ కి లక్ష నుండి లక్షన్నర వరకూ ఉంటుందని వినికిడి.