Bonthu Rammohan: న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌పై ఫోటోలు.. నెట్టింట్లో వైరల్‌!

మే 28న నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా.. టైమ్స్‌ స్క్వేర్‌లో ఒక రోజంతా సీనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రమాలికను డిజిటల్‌ స్క్రీన్‌పై ప్రదర్శించారు. ప్రతీ నాలుగు నిమిషాలకోసారి 15 సెకన్లపాటు అన్నగారి ఫొోటోలు కనిపించాయి.

Written By: Raj Shekar, Updated On : July 8, 2023 11:45 am

Bonthu Rammohan

Follow us on

Bonthu Rammohan: అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో డిజిటల్‌ స్క్రీన్‌పై హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ చిత్రాలను ప్రదర్శించారు ఆయన అభిమానులు. ఆ దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇటీవలే హీరో మహేశ్‌ తనయ సితార నటించిన ప్రకటనను అమెరికా వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందిన న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద డిస్‌ప్లే చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇటు మహేశ్‌™ పాటు అటు సితార సైతం ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా మరో తెలుగు వ్యక్తి అదే గౌరవాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌. జలై 5న రామ్మోహన్‌ జన్మదినం సందర్భంగా 22 వేల చదరపు అడుగుల భారీ స్క్రీన్‌పై ‘హ్యాపీ బర్త్‌ డే బొంతు రామ్మోహన్‌ ’అంటూ ప్రదర్శించారు ఆయన అభిమాని, ఫాలోవర్‌ ముదిరెడ్డి శ్రావణ్‌. విశ్వనగరంగా హైదరాబాద్‌ మార్పులో ఆయన కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా..
మే 28న నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా.. టైమ్స్‌ స్క్వేర్‌లో ఒక రోజంతా సీనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రమాలికను డిజిటల్‌ స్క్రీన్‌పై ప్రదర్శించారు. ప్రతీ నాలుగు నిమిషాలకోసారి 15 సెకన్లపాటు అన్నగారి ఫొోటోలు కనిపించాయి.

‘బొంతు’ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా..
బొంతు రామ్మోహన్‌ బర్త్‌ డే వేడుకలను ఆయన అనుచరులు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు. ఉప్పల్‌ నియోజకవర్గంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి.. అన్నదాన, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. తన పుట్టినరోజున విషెస్‌ తెలియజేసిన అందరికీ బొంతు రామ్మోహన్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇక అందరిలా చెబితే కిక్‌ ఏముంటుందని అనుకున్నాడు ఆయన అభిమాని శ్రావణ్‌. దీంతో నూయార్క్‌ టైమ్స్‌ స్వేర్‌ డిజిటల్‌ బోర్డుపై ‘హ్యాపీ బర్త్‌ డే బొంతు రామ్మోహన్‌ ’అంటూ ప్రదర్శించి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ఎందుకంత ప్రత్యేకం..
వన్‌ టైమ్స్‌ స్క్వేర్‌.. దీనిని 1475 బ్రాడ్‌వే , న్యూయార్క్‌ టైమ్స్‌ బిల్డింగ్‌ , న్యూయార్క్‌ టైమ్స్‌ టవర్‌ లేదా టైమ్స్‌ టవర్‌ అని కూడా పిలుస్తారు. టైమ్స్‌ స్క్వేర్‌లోని 25 అంతస్తుల, 363 అడుగుల ఎత్తు (111 మీ) ఆకాశహర్మ్యం. న్యూయార్క్‌ నగరంలోని మిడ్‌టౌన్‌ మాన్‌ హాటన్‌ ప్రాంతంలో ఉంది. నియో –గోతిక్‌ శైలిలో సైరస్‌ ఎల్‌డబ్ల్యూ ఈడ్లిట్జ్‌ రూపొందించిన ఈ టవర్‌ 1903–1904లో న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రధాన కార్యాలయంగా నిర్మించబడింది . ఇది సెవెంత్‌ అవెన్యూ , 42వ వీధికి సరిహద్దులుగా ఉన్న సిటీ బ్లాక్‌ని తీసుకుంటుంది. బ్రాడ్‌వే, మరియు 43వ వీధి. భవనం యొక్క రూపకల్పన సంవత్సరాలుగా భారీగా సవరించబడింది.

అత్యంత విలువైన ప్రకటన బోర్డుగా గుర్తింపు..
వన్‌ టైమ్స్‌ స్క్వేర్‌పై 1990లో డిజిటల్‌ బోర్డు ఏర్పాటు చేశారు. దీనిపై ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు. అంత్యంత ఎత్తయిన భవనంపై ప్రకటనలు అందరినీ ఆకట్టుకుంటుండడంతో చాలా మంది ప్రకటనలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. కొత్త టెక్నాలజీతో భారీగా ఆదాయం సమకూరుతోంది. వన్‌ టైమ్స్‌ స్క్వేర్‌ ప్రపంచంలోని అత్యంత విలువైన ప్రకటనల స్థానాల్లో ఒకటిగా నిలిచింది.

టైమ్స్‌ స్క్వేర్‌ ప్రకటన ధర ఎంత?
వివిధ అడ్వర్టైజింగ్‌ వెబ్‌సైట్‌ల ప్రకారం, టైమ్స్‌ స్క్వేర్‌ మధ్యలో ఉన్న డిజిటల్‌ బిల్‌బోర్డ్‌లలో ఒకదానిపై స్క్రీన్‌ సమయం ఖర్చు రోజుకు 5 వేల అమెరికన్‌ డాలర్స్‌ నుంచి 50 వేల అమెరికన్‌ డాలర్స్‌ ఉంటుంది. ఇండయిన్‌ కరెన్సీలో రూ.4 లక్షల నుంచి రూ.41 లక్షల వరకు ఉంటుంది. ప్రకటన డిస్‌ప్లే సమయం, సైజును బట్టి ధర మారుతుంది. అంత్యంత ఖరీదైన నగరం, అంత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ టవర్‌ ఉండడంతో దీనిపై ప్రకటనలకు ప్రముఖ్యత ఉంది.