Anchor Ravi: బిగ్ బాస్ కార్యక్రమం చూస్తుండగానే చివరి దశకు వచ్చింది.ఈ క్రమంలోనే 12 వ వారంలో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఊహించని విధంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యారు. అయితే యాంకర్ రవి ఎలిమినేట్ అవుతున్నారన్న విషయం ముందుగానే సోషల్ మీడియాలో తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతూ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఎంతో అద్భుతంగా ఆడుతున్నటువంటి రవి ఎలా ఎలిమినేట్ అవుతాడని అంటూ ప్రశ్నించారు.
Anchor Ravi
ఇకపోతే హౌస్ నుంచి బయటకు రావడంతో ఈయన ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.యాంకర్ రవికి బయట కూడా ఎంతో పాపులారిటీ ఉండడం వల్ల ఈయనకు ఒక వారానికి బిగ్ బాస్ నిర్వాహకులు 7 నుంచి 8 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ప్రకారం చూసుకుంటే రవి సుమారు 90 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
Also Read: యాంకర్ రవి ఎలిమినేషన్ అన్యాయమంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ఫ్యాన్స్ ఆందోళన
ఇక ముందుగా కుదుర్చుకున్న డీల్ ప్రకారం 90 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ ఆయన బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులను సందడి చేసిన విధానాన్ని దృష్టిలో ఉంచుకుని దానికి మరింత ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ రవి విన్నర్ కన్నా ఎక్కువ మొత్తంలో సంపాదించుకున్నారని చెప్పవచ్చు. అయితే ఇలా టాప్ త్రీ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి రవి బయటకు రావడం ఇప్పటికీ ఆయన అభిమానులకు షాకింగ్ గా ఉంది.
Also Read: మన్మధరాజాలకే బిగ్ బాస్ టైటిలా? ఇదేం లాజిక్ రా బాబు!