Kotamreddy Sridhar Reddy: అమరావతి రాజధాని విషయంలో రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరిట రైతులు చేపడుతున్న మహాపాదయాత్రకు మద్దతు లభిస్తోంది. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే సైతం వారికి మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. పాదయాత్రకు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘీభావం తెలపడం హాట్ టాపిక్ గా మారుతోంది. దీంతో ఈ విషయం రాష్ర్టంలో హల్ చల్ చేస్తోంది.

రైతులు చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రైతులను కలిసి తన మద్దతు ప్రకటించారు. మీకు ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించొచ్చని సూచించారు. గ్రామాలు, పట్టణాల మీదుగా సాగుతున్న పాదయాత్రలో ఎమ్మెల్యే పాల్గొనడం సంచలనం రేకెత్తిస్తోంది.

జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసుకునేందుకు వారితో మాట్లాడానని ఎమ్మెల్యే చెబుతున్నారు. అంతేకాని వారికి మద్దతు తెలపలేదన్నారు. అధికార పార్టీ విధానాలకు విరుద్ధంగా ప్రవర్తించడం కుదరదు. అందుకే రైతులకు సమస్యలుంటే చెప్పాలని చెప్పాను కానీ వారికి సంఘీభావం ప్రకటించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఖండించారు.
Also Read: రైతులపై లాఠీచార్జి.. ఎంత అమానుషం
వర్షాలతో ప్రజలు అల్లాడుతున్నారు. భారీ వర్షాలతో రాష్ర్టం మొత్తం అతలాకుతలం అవుతోంది. తన నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పాదయాత్రతో ఎవరికి ఇబ్బందులు తలెత్తకూడదనే వారితో మాట్లాడి ఏ సమస్య రాకుండా చూసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే తనకు ఫోన్ చేయాలని నెంబర్ ఇచ్చానని సూచించారు.
Also Read: అమరావతి ఉద్యమం.. రైతుల చూపు ఆయనవైపే
దీంతో ఎమ్మెల్యే వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్ గా మారుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే రైతులకు మద్దతు తెలపడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. పాదయాత్రకు మద్దతు తెలపలేదని ఎమ్మెల్యే చెబుతున్నా వారితో ఏం మాట్లాడారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. దీంతో వైసీసీలో అనుమానాలు వస్తున్నాయి.