Anchor Rashmi Gautam: ప్రముఖులపై సోషల్ మీడియాలో అనేక పుకార్లు చక్కర్లు కొడుతూ ఉంటాయి. నిరాధార కథనాలు వెలుగులోకి వస్తాయి. ప్రచారమయ్యే వార్తల్లో చాలా వరకు ఫేక్ కావచ్చు. ముఖ్యంగా యూట్యూబర్స్ దారుణమైన థంబ్ నెయిల్స్ తో వ్యూస్ కోసం సదరు ప్రముఖుల మనోభావాలు దెబ్బతీస్తూ ఉంటారు. అలాంటి థంబ్ నెయిల్స్ పై శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా చర్చ నడిచింది. ఆ షో యాంకర్ రష్మీ, జడ్జి ఇంద్రజ, కమెడియన్స్ హైపర్ ఆది, నరేష్ లపై ప్రచారం అవుతున్న పుకార్లు, వాటికి సంబంధించిన థంబ్ నెయిల్స్ ప్రదర్శించారు.

పెద్ద మొత్తంలో దానధర్మాలు చేస్తున్న ఇంద్రజపై ఐటీ దాడులు దాడులు జరిగాయని జరుగుతున్న ప్రచారానికి ఆమె క్లారిటీ ఇచ్చారు. దానధర్మాలు చేశానని మీరే అంటున్నారు. అలాంటప్పుడు నా దగ్గర ఇంకేం ఉంటుంది. మనలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉందని తెలిస్తే, నా వరకూ వస్తే సహాయం చేయడానికి ముందుంటాను. అంతే కానీ నా మీద ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని ఇంద్రజ తెలియజేశారు.
కాగా స్టార్ యాంకర్ రష్మీ పై ఒక దారుణమైన న్యూస్ వైరల్ అవుతుంది. ఒక యూట్యూబర్ ‘రష్మీకి ఖరీదైన విల్లా గిఫ్ట్ గా ఇచ్చిన ప్రముఖ హీరో” అని థంబ్ నెయిల్ పెట్టి వీడియో చేశాడు. ఈ రూమర్ కి శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా రష్మీ క్లారిటీ ఇచ్చారు. ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక ఆడపిల్లపై నిరాధార కథనాలు ఎలా రాస్తారని మండి పడ్డారు. నాకు విల్లా ఇచ్చిన హీరో ఎవరో చెబుతా.. ఆ హీరో ఎవరో కాదు నేనే. విల్లాలు, కార్లు, ఇల్లు, ప్లాట్స్… ప్రతిదీ నా సొంత డబ్బులతో కొన్నుకున్నాను. ఇలాంటి థంబ్ నెయిల్స్ నమ్మకండి. డే అండ్ నైట్ కస్టపడి, షూటింగ్స్ చేసి సంపాదించుకున్న డబ్బులతో కొనుక్కుంటున్నామని కుండబద్దలు కొట్టారు.

పుకార్ల ప్రచారం చేసే వాళ్లకు రష్మీ దిమ్మతిరిగే ఆన్సర్ ఇవ్వడంతో షోలో ఉన్నవాళ్లంతా హర్షం వ్యక్తం చేశారు. సుడిగాలి సుధీర్ తో ఎఫైర్ నడుపుతున్నారన్న వార్తల మీద రష్మీ ఇదే స్థాయిలో ఫైర్ అయ్యారు. సుధీర్ నాకు మధ్య ఎలాంటి బంధం ఉందనేది వ్యక్తిగతం. జీవితానికి సంబంధించిన ప్రతి విషయం చెప్పేస్తే ఇంకేమీ ఉండదు. మా మధ్య ఏముందో భవిష్యత్ లో తెలుస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. రష్మీ హీరోయిన్ గా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.