Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi Godfather OTT: లో మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' సెన్సేషనల్ రికార్డ్

Megastar Chiranjeevi Godfather OTT: లో మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ సెన్సేషనల్ రికార్డ్

Megastar Chiranjeevi Godfather OTT: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా విడుదలై ఫాన్స్ నుండి మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న విషయం తెలిసిందే.. పొలిటికల్ నేపథ్యంలో లో మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన ‘లూసిఫర్’ సినిమాకి రీమేక్ గా తెరకేక్కిన ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్ కంటే బెటర్ అని అనిపించుకుంది.. పాటలు లేకుండా మెగాస్టార్ సినిమాలను ఊహించుకోలేరు ఫాన్స్.. కానీ ఈ సినిమాలో మెగాస్టార్ మార్క్ సాంగ్స్ మరియు డాన్స్ లేకపోయినా కూడా అభిమానులు సంతృప్తి చెందడం విశేషం.. ఇక ఈ సినిమాని ఈ నెల 19 వ తారీఖున నెట్ ఫ్లిక్స్ లో హిందీ మరియు తెలుగు బాషలలో విడుదల చేసారు.. థియేటర్స్ లో ఎంత గొప్ప రెస్పాన్స్ ని అయితే ఈ సినిమాలు దక్కించుకుందో OTT లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.. విడుదలైన 24 గంటల్లోనే ఈ సినిమాకి వచ్చినన్ని వ్యూస్ రీసెంట్ గా విడుదలైన ఏ చిత్రానికి కూడా రాలేదట.

Megastar Chiranjeevi Godfather OTT
Megastar Chiranjeevi Godfather OTT

కేవలం 24 గంటల్లోనే ఈ సినిమాకి తెలుగు మరియు హిందీ బాషలకు కలిపి 20 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయట.. ఈ ఏడాది విడుదలైన తెలుగు సినిమాలలో ఒక్క #RRR కి మినహా మిగిలిన ఏ సినిమాకి కూడా ఈ స్థాయి వ్యూస్ వచ్చిన మూవీ ఒక్కటి కూడా లేదట.. మెగాస్టార్ చిరంజీవి కి ఫ్యామిలీస్ లో ఉన్న ఆపరమైన ఫాలోయింగ్ ఈ సినిమాకి ఆ రేంజ్ రెస్పాన్స్ వచ్చేలా చేసింది అంటున్నారు విశ్లేషకులు..రాబోయ్యే రోజుల్లో ఈ చిత్రానికి మరిన్ని రికార్డ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది.

Megastar Chiranjeevi Godfather OTT
Megastar Chiranjeevi Godfather OTT

ఒక రీమేక్ సినిమా ఈ స్థాయి రికార్డ్స్ సృష్టిస్తుంది అంటే మెగాస్టార్ క్రేజ్ ఇప్పటికి కూడా ఇసుమంత తగ్గలేదని నిదర్శనం.. మెగాస్టార్ ప్రస్తుతం ‘వాళ్తేరు వీరయ్య’ అనే చిత్రం లో నటిస్తున్నారు.. మెగాస్టార్ మార్క్ మాస్ మరియు కామెడీ తో ఫాన్స్ పండుగ చేసుకునే విధంగా ఉండబోతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version