https://oktelugu.com/

Rashmi Gautam Tweet: రేపిస్ట్ నుండి ఎవరైనా కాపాడండి… రష్మీ గౌతమ్ తీవ్ర ఆవేదన, కలచి వేస్తున్న వీడియో

హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన నేపథ్యంలో రష్మీ గౌతమ్ నెటిజెన్స్ టార్గెట్ అయ్యారు. అప్పుడు కూడా వీధి కుక్కలనే రష్మీ గౌతమ్ సమర్ధించారు. ఈ క్రమంలో రష్మీ గౌతమ్ పై కొందరు బెదిరింపులకు కూడా పాల్పడ్డారు.జంతు ప్రేమికురాలిగా రష్మీ గౌతమ్ వీగన్ గా మారారు. ఆమె మాంసం, గుడ్లు తినరు. పాలు, పాలపదార్థాలతో చేసే వస్తువులను కూడా తినరు.

Written By: , Updated On : July 11, 2023 / 08:26 AM IST
Rashmi Gautam Tweet

Rashmi Gautam Tweet

Follow us on

Rashmi Gautam Tweet:  స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ ట్వీట్ ఆందోళన కలిగించింది. అతడు రేపిస్ట్ కూడా, వెంటనే ఎవరైనా కాపాడండి అంటూ ట్వీట్ చేసింది. విషయంలోకి వెళితే రష్మీ గౌతమ్ యానిమల్ లవర్. జీవ హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మూగ జీవాలను ఎవరైనా హింసిస్తే రష్మీ గౌతమ్ సహించరు. వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తారు. తాజాగా రష్మీ గౌతమ్ దృష్టికి ఓ కలచి వేసే వీడియో వచ్చింది.

ఆ వీడియోలో ఒక వ్యక్తి చిన్న పెట్ డాగ్ పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. దాన్ని ఇబ్బంది పడుతున్నాడు. ఆ వీడియో చూసి రష్మీ గౌతమ్ చలించిపోయింది. ఢిల్లీలో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులను, పెటా సంస్థను, ఎంపీ మేనకా సంజయ్ గాంధీని ట్యాగ్ చేస్తూ అతన్నుండి కుక్క పిల్లను కాపాడాలని ట్వీట్ చేసింది. ఆ వ్యక్తి మీద రష్మీ గౌతమ్ తీవ్ర ఆరోపణలు చేసింది. అతని తీరు ఆందోళనకరంగా ఉంది. కుటుంబ సభ్యులు ఎలా భరిస్తున్నారు.

అతడు చిన్న పిల్లల మీద లైంగిక దాడి చేసేవాడిలా ఉన్నాడు. రేపిస్ట్ కూడా కావచ్చు, అంటూ ట్వీట్ లో పొందుపరిచారు. రష్మీ ట్వీట్ వైరల్ గా మారింది. పెట్ లవర్ గా రష్మీ గౌతమ్ సోషల్ మీడియా వ్యతిరేకత కూడా ఎదుర్కొంటున్నారు. ఇటీవల బక్రీద్ పండగ జరిగింది. ముస్లింలు తమ మతాచారంలో భాగంగా జీవాలను వధించడాన్ని ఆమె వ్యతిరేకించారు. రష్మీ ట్వీట్స్ ముస్లింల మనోభావాలు దెబ్బతీశాయి. రష్మీ గౌతమ్ పై వారు మండిపడ్డారు.