https://oktelugu.com/

Indraja: రష్మీ గౌతమ్ – నూకరాజు మధ్య చిచ్చు పెట్టిన ఇంద్రజ… కమెడియన్ కి స్టార్ యాంకర్ స్ట్రాంగ్ వార్నింగ్!

Indraja: ఎప్పటిలానే టీఆర్పీ స్టంట్ అని ఆడియన్స్ భావించారు. కానీ వాళ్ళు నిజంగానే గొడవ పడినట్లు తెలుస్తుంది. తాజాగా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమో చూస్తే ఈ విషయం క్లారిటీగా అర్థమవుతుంది. కాగా వీరిద్దరి మధ్య ఇంద్రజ చిచ్చు పెట్టిందట.

Written By:
  • S Reddy
  • , Updated On : July 11, 2024 / 05:02 PM IST

    Anchor Rashmi Gautam strong warning to Nukaraju

    Follow us on

    Indraja: యాంకర్ రష్మీ జబర్దస్త్ కమెడియన్ నూకరాజు మధ్య ఇటీవల గొడవ జరిగింది. శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా వాగ్వాదానికి దిగారు. రష్మీ గౌతమ్ ఒకింత సీరియస్ అయ్యింది. నూకరాజు ఆమె వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇది కూడా ఎప్పటిలానే టీఆర్పీ స్టంట్ అని ఆడియన్స్ భావించారు. కానీ వాళ్ళు నిజంగానే గొడవ పడినట్లు తెలుస్తుంది. తాజాగా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమో చూస్తే ఈ విషయం క్లారిటీగా అర్థమవుతుంది. కాగా వీరిద్దరి మధ్య ఇంద్రజ చిచ్చు పెట్టిందట.

    జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్లో నూకరాజు ఏఎన్ఆర్ గెటప్ వేశాడు. ఆయన్ని ఇమిటేట్ చేస్తూ అందరి పై పంచులు వేశాడు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ లో జరిగిన గొడవను ప్రస్తావిస్తూ రష్మిని కూల్ చేసేందుకు ప్రయత్నించాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రతి వారం ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రీసెంట్ గా ఫస్ట్ క్రష్ అనే థీమ్ చేశారు. అయితే నూకరాజు మీ క్రష్ ఎవరో చెప్పాలంటూ రష్మిని అడిగాడు. దీంతో రష్మీ సీరియస్ అయింది. నా వ్యక్తిగత విషయాలు మీరు ఎందుకు అడుగుతున్నారని అసహనం వ్యక్తం చేసింది.

    మా పర్సనల్ డౌట్స్ మీకు ఎలా ఉంటాయో అలాగే మాకు మీ పర్సనల్ డౌట్స్ అని నూకరాజు అడుగుతాడు. అది మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని అడగాలి అని రష్మీ ఫైర్ అవుతుంది. అలాగా సరే… అంటూ నూకరాజు అక్కడనుండి వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు ఆ గొడవ మేటర్ జబర్దస్త్ లో మాట్లాడాడు. రష్మీ వైపు చూస్తూ ఇక్కడ తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అసలు తప్పు మీది కాదు .. నాది కాదు, అమ్మది(ఇంద్రజ).

    ఇలా నిప్పు గీసి పెద్ద మంట పెట్టింది. ఆ మంటలో నువ్వు నేను కాలిపోయాం. నన్ను అనే చనువు నీకు లేదా. నిన్ను అనే చనువు నాకు లేదా. ఆ ఇంట్లో జరిగిన గొడవలకు ఈ ఇంట్లో అలక ఎందుకు చిలక అని నూకరాజు పంచులు వేశాడు. దీంతో జడ్జిలు ఖుష్భు, కృష్ణ భగవాన్ నవ్వేశారు. కానీ రష్మీ మాత్రం కాస్త కోపంగా ఉన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. మరి ఈ గొడవ ఇంతటితో ముగిసిందా. లేక రష్మీ దీనిని పర్సనల్ తీసుకుని నూకరాజు మాట్లాడకుండా ఉంటుందో ఫుల్ ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తుంది.

    సాధారణంగా ఎలాంటి గొడవలు టీఆర్పీ కోసం కావాలని క్రియేట్ చేస్తారు. ఒక్కోసారి నిజం కూడా ఉంటాయి. అనసూయ జబర్దస్త్ మానేయడానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. అనసూయ మీద జబర్దస్త్ కమెడియన్స్ కామెడీ పంచులు వేసేవారు. కొన్నిసార్లు అవి ఆమెను ఇబ్బంది పెట్టేవట. బాడీ షేమింగ్ కి పాల్పడిన వారిపై ఆమె సీరియస్ అయ్యేవారట. అవేమీ షోలో చూపించేవారు కాదని, ఎడిటింగ్ లో తీసేసేవారని, జబర్దస్త్ మానేసిన అనసూయ ఆరోపణలు చేసింది.

    ఒక పరిమితికి వరకు యాంకర్స్ భరిస్తారు. ప్రోగ్రాం అంటే అందరూ కలిసి చేయాలి. మనస్పర్థలు ఎందుకని సీరియస్ గా తీసుకోకుండా వదిలేస్తారు. హైపర్ ఆది అయితే మరీ దారుణం. అతడు జడ్జెస్ ని కూడా వదిలేవాడు కాదు. పదునైన పంచ్ లతో దాడిచేసేవాడు. ఒక దశకు వచ్చాక అనసూయను తన ప్రతి స్కిట్ లో భాగం చేశాడు. ఈటీవీలో హైపర్ ఆదిదే పూర్తి హవా. మల్లెమాల షోలన్నీ అతడి మీదే నడుస్తాయి. కాబట్టి ఆది ఏం చేసినా చెల్లేది. కామెడీ పేరుతో మితిమీరిన జోక్స్ మహిళల మీద వేయడం కూడా సరికాదు.