Homeఎంటర్టైన్మెంట్Anchor Lasya: తల్లైన యాంకర్ లాస్య. ప్రూఫ్స్ చూపుతూ సోషల్ మీడియా పోస్ట్!

Anchor Lasya: తల్లైన యాంకర్ లాస్య. ప్రూఫ్స్ చూపుతూ సోషల్ మీడియా పోస్ట్!

Anchor Lasya: ఆ మధ్య మళ్ళీ తల్లి ఎప్పుడవుతారని అడిగిన వాళ్ళ చెంప పగలగొడతానని అర్థం వచ్చేలా లాస్య ఓ పోస్ట్ పెట్టారు. దీంతో లాస్యకు రెండో బిడ్డను కనే ఆలోచన లేదని అందరూ అనుకున్నారు. కొడుకు జున్నునే తనకు ప్రాణం అనుకున్నారు. అయితే సడన్ గా ఆమె షాక్ ఇచ్చారు. మరలా గర్భం దాల్చినట్లు చెప్పారు. ఇంస్టాగ్రామ్ వేదికగా లాస్య భర్త మంజునాథ్ తో పాటు ఈ గుడ్ న్యూస్ పంచుకున్నారు. ఏకంగా మెడికల్ రిపోర్ట్స్ చూపిస్తూ తాను తల్లైన విషయం కన్ఫర్మ్ చేసింది లాస్య. ఇక లాస్య గర్భం దాల్చారని తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read: Pawan Kalyan America Tour: అర్జంట్ గా అమెరికా వెళుతున్న పవన్ కళ్యాణ్.. అందుకోసమేనా?

Anchor Lasya
Anchor Lasya

లాస్య ఆరోగ్యంగా పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నారు. లాస్య ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంట్లో పెద్దవాళ్ళను ఎదిరించి కోరుకున్నవాడిని ఆమె కట్టుకున్నారు. మంజునాథ్ తో వివాహానికి లాస్య తండ్రి ససేమిరా అన్నారట. పెళ్ళయాక చాలా కాలం తల్లిదండ్రులకు దూరంగా బ్రతికారు. అయితే లాస్యకు కొడుకు పుట్టాక తండ్రి దగ్గరకు చేర్చుకున్నారట. ఇప్పుడు పేరెంట్స్ తో ఆమెకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ విషయాన్ని లాస్య బిగ్ బాస్ హౌస్లో తెలియజేశారు.

Also Read: Bullet Bandi Song Fame Bridegroom: బుల్లెట్టు బండి సాంగ్‌తో పాపులరైన పెళ్లి కొడుకు .. అవినీతి ఉద్యోగిగా ఏసీబీకి చిక్కాడు

లాస్య కొడుకు పేరు జున్ను. ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉండగా అక్కడికి తండ్రితో పాటు వచ్చాడు. ఇప్పుడు జున్ను వయసు ఐదేళ్లు ఉండవచ్చు. చాలా గ్యాప్ తీసుకొని సెకండ్ చైల్డ్ ని ప్లాన్ చేశారు. గతంలో లాస్య ఓ ఆసక్తికర సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ఎక్కడకు వెళ్లినా రెండో బిడ్డను ఎప్పుడు కంటావు అని అడుగుతున్నారు. వాళ్లందరికీ ఇదే నా సమాధానం అంటూ… చెంప దెబ్బకొట్టినట్లు సైగ చేశారు. లాస్య పోస్ట్ చూసి ఇకపై ఆమె తల్లి కావాలి అనుకోవడం లేదనుకున్నారు. అయితే సెకండ్ ప్రెగ్నన్సీ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది.

Anchor Lasya
Anchor Lasya

ఇక యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన లాస్య పలు బుల్లితెర ఈవెంట్స్ లో కనిపించారు. యాంకర్ రవితో ఆమె ఒకటి రెండు షోస్ చేశారు. కారణం తెలియదు కానీ లాస్య బుల్లితెరకు దూరమయ్యారు. 2020లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 4లో ఆమె పాల్గొన్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా లాస్య చివరి వారాలకు ఉన్నారు. అయితే ఫైనల్ కి వెళ్లలేకపోయారు. ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడే లాస్యను ప్రేక్షకులు ఇంటికి పంపేశారు. నిజానికి ఆమె టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగారు.

Also Read: Chiranjeevi- Janasena: చిరంజీవి వ్యాఖ్యలతో జనసేనకు పెరుగనున్న ఓటుబ్యాంకు? 

Recommended videos:

Adivi Sesh Speech At Aa Ammayi Gurinchi Meeku Cheppali Pre Release Event || Oktelugu Entertainment

మహేష్ బాబు పై విరుచుకుపడుతున్న అభిమానులు | Mahesh Fans Fires On Mahesh Babu | OkteluguEntertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

1 COMMENT

Comments are closed.

Exit mobile version