Anchor Jhansi: యాంకర్ గా నటిగా ఝాన్సీకి ఎంత పేరు ఉందో.. అన్యాయాల గొంతు ఎత్తడంలో ఆమెకు అంత పేరు ఉంది. ఝాన్సీ అంటే.. డేరింగ్ అండ్ డాషింగ్ మహిళ. సరిపడని భర్తను సైతం పక్కకి తోసేసిన తెగింపు ఆమె సొంతం. నచ్చితే.. ఏమైనా చేయడానికి వెనకడుగు వేయని ఆవేశం ఆమె సొంతం. అందుకే ఎప్పటికపుడు సోషల్ మీడియాలో తనదైన శైలిలో పలు అంశాలపై స్పష్టమైన తన గళం వినిపించడంలో ఆమెకు సరిలేరు ఎవరు.

అయితే, తాజాగా ఝాన్సీ మీడియాపై విరుచుకుపడింది. ఈ సందర్భంగా ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేసింది. ‘అనగనగా ఓ ఎద్దు, దానికో పుండు, ఆ పుండులో పురుగులు… ఎద్దు పుండు కాకికి ముద్దు. కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి పురుగులు తిన్నాయి, పండును పెద్దది చేశాయి. ఎద్దు రెచ్చి పోయింది, కాకులు గోల పెంచాయి. మైకులు పెట్టి మరీ మా మురికి గొట్టాలని జనాల ఇళ్లలోకి వదలడం మించి ముఖ్యమైన వార్తలు లేవా?

సినిమా ఇంట్లో పెళ్లి అయినా, విడాకులు అయినా, ఎన్నికల అయినా లోకులకు సందడి అనుకుని హడావిడి చేస్తున్న కాకుల్లారా… ప్రజా ప్రయోజనం అంటే ఏంటో డిక్షనరీలో చూడండి” అంటూ ఝాన్సీ ఆవేశంగా ఆలోచనలు రేకెత్తించే సంచలన వ్యాఖ్యలు చేసింది, బాగుంది. సినిమాలను జనం చూడాలి. కానీ ఆ సినిమా వాళ్ళ సంగతులను జనానికి చెప్పకూడదా ?
సినిమా అంటేనే.. గ్లామర్ గాసిప్ ల ప్రపంచం.. నటీనటులు తప్పు చేస్తే సమాజానికి ఎందుకు చెప్పకూడదు. నిజానికి సినీ మీడియా మొత్తం సినిమా ఇండస్ట్రీ పై బతుకుతుందనే అపోహ చాలామందికి ఎప్పటి నుంచో ఉంది. కానీ నిజం ఏంటంటే.. సినిమా వాళ్లే ఆ మీడియా ద్వారా ఎదిగారు. ఉదాహరణకు ఆ మధ్య విజయ్ దేవరకొండ మీడియా తమ వల్లే బతుకుతుంది అని చెప్పుకొచ్చాడు.
కానీ, నేడు ఆ కొండకి అంటూ ఒక గుర్తింపు వచ్చింది అంటే.. కారణం మీడియా అనే విషయాన్ని ఎందుకు మర్చిపోయాడు..? కేవలం మీడియా తనను గుర్తించడం వల్లే అవకాశాలు వచ్చాయని హీరోలు, నటీనటులకు ఎందుకు అర్ధం కావడం లేదు ? ఇదే ఝాన్సీ విషయానికి వద్దాం. ఆమె జీవితం మొదలైందే మీడియాలో. యాంకర్ గా పేరు తెచ్చుకోవడం వల్లే.. సినిమాల్లో అప్పుడప్పుడు కనిపించగలుగుతుంది.
లేకపోతే.. ఝాన్సీ ఏమైనా గ్లామర్ బ్యూటీ కాదు కదా ? ఆమెను గుర్తు పెట్టుకుని మరీ మేకర్స్ ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి. కాబట్టి.. ఝాన్సీ న్యూస్ ను నాన్సెన్స్ అనకుండా ఉండాలి. అలాగే వార్తలను జాగ్రత్తగా ఎంచుకోండి అంటూ ప్రజలకు చెప్పే రైట్ ఝాన్సీకి లేదు అని గ్రహించాలి. మొత్తానికి మారాల్సింది మీడియా కాదు, సినిమా వాళ్లే.