Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ నటిగా ఫుల్ బిజీ. అయినప్పటికీ ఆమె పండగలు, పబ్బాలు, స్పెషల్ ఈవెంట్స్ కి ప్రత్యేక స్థానం ఇస్తారు. అనసూయ సంక్రాంతి వేడుకలు కుటుంబంతో పాటు జరుపుకున్నారు. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. అనసూయ జబర్దస్త్ వేదికగా ఫేమ్ తెచ్చుకుంది. మొదట్లో ఆమె నటిగా ప్రయత్నాలు చేశారు. అనంతరం న్యూస్ రీడర్ గా, ప్రైవేట్ కంపెనీలో హెచ్ ఆర్ గా చేసింది. కానీ క్రియేటివ్ ఫీల్డ్ లో ఎదగాలి అనేది ఆమె కోరిక.
అందుకే జబర్దస్త్ షోలో అడుగుపెట్టారు. 2013 లో జబర్దస్త్ కామెడీ షో ప్రయోగాత్మకంగా మొదలైంది. రోజా, నాగబాబు జడ్జెస్. యాంకర్ గా అనసూయ ఎంపికైంది. అయితే యాంకరింగ్ లో గ్లామర్ యాంగిల్ ట్రై చేశారు. చెప్పాలంటే జబర్దస్త్ కి ముందు తెలుగు యాంకర్స్ పొట్టి బట్టలు వేయడం, స్కిన్ షో చేయడం అనే కాన్సెప్ట్ లేదు. ఉదయభాను, ఝాన్సీ, సుమ ఎన్నడూ ఎక్స్ పోజ్ చేసింది లేదు. అనసూయ తీరు కొందరికి కొత్తగా అనిపించింది.
అదే సమయంలో విమర్శలు వెల్లువెత్తాయి. తన డ్రెస్సింగ్ పై ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ తగ్గింది లేదు. ఇంకా విమర్శలు చేసే వాళ్లకు తనదైన శైలిలో కౌంటర్స్ వేసింది. నా బట్టలు నా ఇష్టం, నాకు కన్ఫర్మ్ అనిపిస్తే ఎలాంటి బట్టలు అయినా ధరిస్తాను అంటూ ఓపెన్ గా చెప్పింది. అనసూయ గట్స్ కొందరికి నచ్చాయి. 2022 వరకు అనసూయ జబర్దస్త్ లో కొనసాగారు. జబర్దస్త్ చేస్తూనే నటిగా ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అయ్యింది.
అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ వదిలేశారు. గత ఏడాది ఆమె మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాల్లో నటించారు. విభిన్నమైన పాత్రలు చేసి మెప్పించింది. నెక్స్ట్ ఆమె పుష్ప 2 లో లేడీ విలన్ గా మెస్మరైజ్ చేయనున్నారు. ఇక సంక్రాంతి వేళ చీరలో గ్లామరస్ గా తయారైంది. భర్త, ఇద్దరు కొడుకులతో సంక్రాంతి వేడుకలు ఘనంగా చేసుకుంది. ఈ ఫోటోలు అనసూయ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి.