Manchu Family: టాలీవుడ్ పెద్ద కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ ఒకటి. మోహన్ బాబు దశాబ్దాల పాటు నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై తన మార్క్ క్రియేట్ చేశారు. మొదట్లో విలన్ రోల్స్ చేసిన మోహన్ బాబు హీరోగా అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. మోహన్ బాబు హీరోగా నటించిన అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, పుణ్యభూమి నాదేశం లాంటి చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. మోహన్ బాబు హీరోగా ఫేడ్ అవుట్ అయ్యారు. ఆయన కుమారులు మంచు విష్ణు, మనోజ్ హీరోలుగా సినిమాలు చేస్తున్నారు.
కాగా మంచు వారి ఫ్యామిలీలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. మోహన్ బాబు తన కొడుకు మంచు విష్ణు, కోడలు విరానిక రెడ్డితో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. మోహన్ బాబు సంక్రాంతి వేడుకలలో మంచు మనోజ్ మిస్ అయ్యాడు. అలాగే లక్ష్మి కూడా జాయిన్ కాలేదు. మంచు బ్రదర్స్ మధ్య కొన్నాళ్లుగా విబేధాలు కొనసాగుతున్నాయి. మనోజ్ రెండో వివాహం చేసుకోగా దానికి విష్ణు హాజరు కాలేదు.

అలాగే విష్ణు తన మనుషులపై దాడి చేస్తున్నాడని మనోజ్ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మంచు ఫ్యామిలీ రెండు వర్గాలుగా విడిపోయింది. మోహన్ బాబు, విష్ణు ఒక వర్గం, మనోజ్, మంచు లక్ష్మి మరొక వర్గంగా మారారు. మోహన్ బాబు కుటుంబానికి మనోజ్ దూరంగా ఉంటున్నాడు. మంచు లక్ష్మి ఇటీవల మకాం ముంబై కి మార్చింది. ఆమె అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో మోహన్ బాబు, మంచు విష్ణు మాత్రమే సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.
మరోవైపు మంచు విష్ణు హీరోగా కన్నప్ప టైటిల్ తో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. న్యూజిలాండ్ లో ఈ చిత్ర షూటింగ్ జరిగింది. 60 % షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. మిగతా షూటింగ్ కూడా న్యూజిలాండ్ లో చేస్తారట. ఇక కన్నప్ప మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి స్టార్ క్యాస్ట్ భాగం అవుతున్నారు. కన్నప్పలో ప్రభాస్ శివుడు రోల్ చేస్తున్నాడనే వాదన ఉంది. కన్నప్ప ఈ ఏడాది విడుదల కానుంది.
ఈ సంక్రాంతి మీకు మరిన్ని ఆనందాలు పంచాలని. మీ జీవితం సంతోషాలతో నిండాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.#HappySankranti #MakarSankranti #HappyPongal pic.twitter.com/QHHETTzyfM
— Mohan Babu M (@themohanbabu) January 15, 2024