Anasuya Bharadwaj: స్టార్ యాంకర్ అనసూయ నటిగా బిజీ అయ్యాక బుల్లితెరకు గుడ్ బై చెప్పేశారు. జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన అనసూయ మెల్లగా అన్ని షోస్ వదిలేశారు. జబర్దస్త్ లో అనసూయ దాదాపు 9 ఏళ్ళు ప్రయాణం చేశారు. ఆమె బుల్లితెర ప్రస్థానం మొదలైంది అక్కడే. అనసూయ ప్రస్తుతం అనుభవిస్తున్న ఫేమ్, నేమ్ జబర్దస్త్ పుణ్యమే. జబర్దస్త్ మానేశాక జీవితం ఇచ్చిన షోపై అనసూయ విమర్శలు చేయడం కొసమెరుపు. జబర్దస్త్ కమెడియన్స్ కారణంగా నేను బాడీ షేమ్ కి గురయ్యాను. నా శరీరాన్ని ఉద్దేశిస్తూ వారు చేసే కామెంట్స్ ఇబ్బంది పెట్టేవి. నా కోపాన్ని, అసహనాన్ని కనిపించకుండా ఎడిటింగ్ లో లేపేసేవారు… అని అనసూయ చెప్పుకొచ్చారు.

అనసూయ యాంకరింగ్ మానేయడం శ్రీముఖికి బాగా కలిసొస్తుంది. ప్రస్తుతం బుల్లితెరపై సందడి మొత్తం శ్రీముఖిదే. దాదాపు నాలుగైదు షోలు శ్రీముఖి చేతిలో ఉన్నాయి. రష్మీకి డిమాండ్ ఉన్నా.. ఇతర ఛానల్స్ కి వెళ్లే ఛాన్స్ లేదు. అగ్రిమెంట్స్ తో రష్మీని కట్టిపడేశారనే వాదన ఉంది. అయినా… బుల్లితెర షోలతో వచ్చేది చిల్లర మాత్రమే. నటిగా ఎదిగితే సినిమాకు కోట్లు పట్టేయవచ్చు. అలా అనసూయ బెటర్మెంట్ వెతుక్కుంది.
అనసూయ హీరోయిన్ గా దర్జా, వాంటెడ్ పండుగాడ్ చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ఖిలాడి, పక్కా కమర్షియల్, గాడ్ ఫాదర్ చిత్రాల్లో అనసూయ కీలక రోల్స్ చేశారు. పలు సినిమాలు, వెబ్ సిరీస్లు ఆమె చేతిలో ఉన్నాయి. అనసూయ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. ఈ మూవీలో దాక్షాయణిగా అనసూయ ఊరమాస్ రోల్ చేస్తున్నారు. పార్ట్ 1 లో కూడా అనసూయ నటించిన విషయం తెలిసిందే. అలాగే కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో నటిస్తున్నారు.

అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. అదే సమయంలో అనసూయ అనుకోని వివాదాల్లో చిక్కుకుంటున్నారు. లైగర్ మూవీని ఉద్దేశిస్తూ అనసూయ నెగిటివ్ ట్వీట్ వేశారు. హర్ట్ అయిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. అనసూయ కూడా తగ్గకుండా వారిపై తిరగబడ్డారు. సోషల్ మీడియా వేధింపులను సీరియస్ గా తీసుకున్న అనసూయ కంప్లైంట్స్ ఇస్తున్నారు.

మరో వైపు సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ తో వేడి పుట్టిస్తున్నారు. తాజాగా నడుము, నాభీ చూపిస్తూ అనసూయ మైండ్ బ్లాక్ చేశారు. అనసూయ బోల్డ్ ఫోజెస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సదరు ఫోటోలకు అనసూయ… ‘అంతా మీ ఆలోచనలోనే ఉంటుంది’, అని కామెంట్ పెట్టారు. బుల్లితెరపై అనసూయ గ్లామర్ మిస్ అవుతున్న జనాలు సోషల్ లో ఎంజాయ్ చేస్తున్నారు.