https://oktelugu.com/

యాంకర్ అనసూయ షాకింగ్ స్టేట్ మెంట్

అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో. అటు బుల్లితెర మీద అలరిస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తుంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నా అప్పుడప్పుడు వివాదాల్లోనూ చిక్కుకుంటుంటుంది. ముఖ్యంగా తన డ్రెస్‌ల విషయంలో. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అను.. ఆడవాళ్ల పట్ల జరుగుతున్న అన్యాయాలు, అరాచకలపై స్పందిస్తుంటారు. ఫెమిస్ట్‌గా పేరున్న అను తనపై వస్తున్న ట్రోలింగ్స్‌ను కూడా ఇట్టే కొట్టిపడేస్తుంటారు. అనసూయ ధరిస్తున్న డ్రెస్‌లపై నెటిజన్లు నిత్యం స్పందిస్తూనే ఉంటారు. అభిమానులూ అలాంటి డ్రెస్సులు ఎందుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2020 / 11:29 AM IST

    anasuya

    Follow us on

    అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో. అటు బుల్లితెర మీద అలరిస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తుంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నా అప్పుడప్పుడు వివాదాల్లోనూ చిక్కుకుంటుంటుంది. ముఖ్యంగా తన డ్రెస్‌ల విషయంలో. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అను.. ఆడవాళ్ల పట్ల జరుగుతున్న అన్యాయాలు, అరాచకలపై స్పందిస్తుంటారు. ఫెమిస్ట్‌గా పేరున్న అను తనపై వస్తున్న ట్రోలింగ్స్‌ను కూడా ఇట్టే కొట్టిపడేస్తుంటారు.

    అనసూయ ధరిస్తున్న డ్రెస్‌లపై నెటిజన్లు నిత్యం స్పందిస్తూనే ఉంటారు. అభిమానులూ అలాంటి డ్రెస్సులు ఎందుకు ధరించడం అంటూ సూచిస్తూనే ఉంటారు. కానీ.. ఈ కామెంట్స్‌ను అను పెద్దగా పట్టించుకోదు. అంతేకాదు.. ‘నేనేమి ధరిస్తే మీకేంటని’ అడుగుతుంటుంది. అప్పట్లో ఓ టీవీ ఛానల్‌లో ఓ కమెడియన్‌తో వచ్చే ప్రోగ్రాంలోనూ అనసూయ వేసిన డ్రెస్సుపై చాలా వరకు కామెంట్స్‌ వచ్చాయి. తాజాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పంచుకుంది. దానికి ‘పరిపూర్ణంగా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. కేవలం వాస్తవికతే ప్రామాణికం’ అంటూ కామెంట్‌ పెట్టింది.

    పనికిరాని నియమాలు పాటిస్తూ ఎవరి కోసమో పర్‌‌ఫెక్ట్‌గా బతకాలని ఎప్పుడూ అనుకోలేదని అంది. నిజజీవితంలో కూడా అనసూయ అలానే ఉంటుంది. తనకు నచ్చినట్లు ఆమె లైఫ్‌ స్టైల్‌ మార్చుకుంటూ ఉంటుంది. మాట్లాడాలనిపిస్తే ఎటువంటి బర్నింగ్‌ టాపిక్‌కు అయినా స్పందిస్తుంది.

    యాంకర్‌‌గానే కాకుండా నటిగానూ వరుస అవకాశాలు దక్కించుకుంటున్న అను ప్రస్తుతం రంగమార్తాండ మూవీలో ఓ కీలక రోల్‌ చేస్తోంది. ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో అనసూయ పాత్ర దేవదాసి అని తెలుస్తుండగా.. బోల్డ్‌ కంటెంట్‌తో వస్తున్నట్లు సమాచారం.