Anchor Anasuya: ‘జబర్థస్త్’ యాంకర్ గా తన అందచందాలతో ప్రేక్షకులను అలరించి ఫుల్ క్రేజ్ ను సంపాదించింది ఆల్ టైం బ్యూటీ ‘అనసూయ’. మొత్తానికి బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫుల్ డిమాండ్ తో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. అయితే, తాజాగా అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్ ఓ గిఫ్ట్ ఇచ్చాడోచ్ అంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అయితే, ఈ ఫోటోల్లో ఆమె తన చేతి వాచ్ ను హైలైట్ చేస్తూ చూపించింది. కాగా ఈ ఫోటోలను చూసిన అభిమానులు.. ‘నువ్వు మేకప్ లేకున్నా కూడా చాలా బాగుంటావ్’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇక మరో నెటిజన్ ‘ఏంటి? సెల్ఫీ అడిగితే ఫోన్ పగలగొట్టావట. ఇది నిజమేనా?’ అంటూ అతను ప్రశ్నించాడు. అయితే, అతని ప్రశ్నకి అనసూయ స్పందిస్తూ ‘ఎవరు సార్ మీకు చెప్పింది ?’ అంటూ తిరిగి ప్రశ్నించింది.
దీనికి సదరు నెటిజన్ సమాధానమిస్తూ.. ‘దానికి సంబంధించిన వీడియో కూడా నెట్ లో ఉంది. కావాలంటే మీకు కూడా పంపుతాను. అందులో మీ కారు నంబర్ కూడా ఉందనే విషయం మీరు గ్రహించాలి. ఒకవేళ ఇది ఫేక్ వీడియో అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని అతను వివరణ ఇచ్చాడు. ఇక అతని సమాధానానికి యాంకర్ స్పందిస్తూ..’సరే గానీ, మీకు నా నుంచి ఒక విన్నపం. దయచేసి యూట్యూబ్‌లో వచ్చేవాటిని మీరు ఎప్పటికీ నమ్మకండి.
Also Read: ప్చ్.. కరోనా బారిన పడిన మరో హీరోయిన్ !
వాళ్ళు బతకడం కోసం ఏదైనా చేయడానికి ముందు ఉంటారు. ఇలాంటివి చూసినప్పుడే నాకు మానవత్వం చచ్చిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. దయచేసి ఒకరి పట్ల ఒకరం బాధ్యతగా ఉందాం. నా గురించి ఇంతలా ఆలోచించినందుకు మీకు ధన్యవాదాలు’ అంటూ అనసూయ రాసుకొచ్చింది. ఇక అనసూయ యాంకర్ గా మారకముందు విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో హెచ్‌ఆర్ గా కూడా కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసింది.
ఆ సమయంలోనే దర్శకుడు సుకుమార్ ఆమెను చూసి తన సినిమాలో అవకాశం ఇస్తానని ఆఫర్ ఇచ్చాడట. అయితే ఆమె యాంకర్ గా మారిన తరువాతే, ఆమె నటిగా టర్న్ తీసుకుంది.
[…] […]