Anasuya shocking comments: హీరోయిన్స్ వేసుకునే దుస్తులపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తాలూకా వేడి సోషల్ మీడియా లో ఇంకా తగ్గలేదు. ఆ వ్యాఖ్యలు చేసిన శివాజీ, పూర్తిగా దాని నుండి బయటకు వచ్చి తన పని తానూ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. కానీ ఈ వ్యాఖ్యలపై తమ అభిప్రాయాలను తెలియజేస్తూ సోషల్ మీడియా లో సినీ సెలబ్రిటీలు ఇప్పటికీ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. రీసెంట్ గానే ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ ఈ అంశం పై స్పందించి, ఇష్టమొచ్చినట్టు నోరు జారీ, ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి. ఆయన యూట్యూబ్ ఛానల్ కి రెండు కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్స్ పడ్డాయి. ఇంకొక్క స్ట్రైక్ పడితే ఛానల్ శాశ్వతంగా కనిపించకుండా పోతుంది. మరోపక్క యాంకర్ అనసూయ కూడా ఈ అంశం పై స్పందించి, వివాదాలను తన మెడకు చుట్టుకున్న సంగతి తెలిసిందే.
అయితే సోషల్ మీడియా లో తనపై నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోయిందని పసిగట్టిందో ఏమో తెలియదు కానీ, రీసెంట్ గా అభిమానులతో ఆమె ఇన్ స్టాగ్రామ్ లో నిర్వహించిన చిట్ చాట్ లో, ఆమె శివాజీ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఒక అభిమాని ఆమెని ప్రశ్న అడుగుతూ ‘మేడం శివాజీ సార్ మాట్లాడినది కరెక్టే, కానీ రెండు తప్పు పదాలు ఉపయోగించారు, అది నేను కూడా ఒప్పుకుంటాను, మరి ఈ అంశం పై మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడుగుతాడు. అందుకు అనసూయ సమాధానం చెప్తూ ‘ ఆయన రెండు పదాలు దొర్లాడు అని అంటున్నారు, అది కాకుండా శివాజీ గారు ఎన్నో పాత్రలు పోషించి, ఈ స్థాయికి ఎదిగి, అక్కడికి వచ్చి అలా మాట్లాడారు, కానీ సినిమాల్లో ఆయన పోషించే పాత్ర ప్రభావం బయట కూడా కనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ ఆయన ఆడవాళ్ళ సేఫ్టీ ని ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడడాన్ని కూడా నేను స్వాగతిస్తున్నాను, ఆయన మంచి ఉద్దేశ్యం తోనే చెప్పాడు. అయితే ఆడవాళ్ళ సేఫ్టీ గురించి చెప్పిన ఆయన, మగవాళ్లకు కూడా అమ్మాయిల పట్ల పద్దతిగా వ్యవహరించి, ఆడవాళ్లను ఇలాంటి సందర్భాల్లో మనం కాపాడుకోవాలి అని మగవాళ్లకు కూడా ఒక మాట చెప్పి ఉండుంటే, ఇంత పెద్ద గొడవ అయ్యేది కాదంటూ’ అనసూయ చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ని మీరు క్రింద చూడవచ్చు. వారం రోజుల క్రితం శివాజీ వ్యాఖ్యలను పూర్తగా తప్పుబట్టిన యాంకర్ అనసూయ, ఇప్పుడు కాస్త ఆయనపై పాజిటివ్ గా రెస్పాన్స్ ఇవ్వడం గమనార్హం.
శివాజీ ఎంతో కష్టపడి, మంచి పాత్రలు పోషించి, ప్రజలు తన మాట వినే స్థాయికి చేరుకున్నారు: అనసూయ
మహిళల భద్రత గురించి ఆయన మాట్లాడిన విధానం వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే: అనసూయ
కేవలం హెచ్చరించడమే కాకుండా, అబ్బాయిలకు కూడా బాధ్యతను గుర్తుచేసేలా మాట్లాడి ఉంటే బాగుండేది: అనసూయ pic.twitter.com/rfma0N7xCR
— ChotaNews App (@ChotaNewsApp) January 8, 2026