https://oktelugu.com/

Anasuya Bharadwaj : రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన యాంకర్ అనసూయ.. ఇంతకీ ఏమందంటే?

రజాకార్ చిత్ర ప్రమోషన్స్ పాల్గొన్న అనసూయను విలేకరులు ఈ మేరకు ప్రశ్నలు అడిగారు. మీరు రాజకీయాల్లోకి వెళుతున్నారట కదా అని అడగ్గా...

Written By:
  • NARESH
  • , Updated On : October 11, 2023 / 10:28 AM IST

    Anasuya Bharadwaj

    Follow us on

    Anasuya Bharadwaj : అనసూయ రాజకీయాల్లోకి వెళుతున్నారంటూ ప్రచారం జరుగుతుండగా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఓ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న అనసూయ ఇలా అన్నారు. అనసూయ నటిగా ఫుల్ బిజీ. ఆమె వరుస చిత్రాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆమె నటించిన రంగమార్తాండ, విమానం, పెదకాపు 1 చిత్రాలు విడుదలయ్యాయి. ఆమెకు కీలక రోల్స్ దక్కుతున్నాయి. ఇదిలా ఉంటే అనసూయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఆమె స్వయంగా స్పందించారు.

    రజాకార్ చిత్ర ప్రమోషన్స్ పాల్గొన్న అనసూయను విలేకరులు ఈ మేరకు ప్రశ్నలు అడిగారు. మీరు రాజకీయాల్లోకి వెళుతున్నారట కదా అని అడగ్గా… ఆమె ఖండించారు. రాజకీయాలపై నాకు ఆసక్తిలేదని ఆమె చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్లకుండా కూడా మంచి పనులు చేయవచ్చు. రాజకీయనాయకులు చేసే పనులు వాళ్ళను చేయనిద్దాం. నా వంతు నేను సమాజానికి మేలు చేసే ప్రయత్నం చేస్తున్నాను, అన్నారు.

    రజాకార్ చిత్ర నిర్మాత నారాయణరెడ్డి బీజేపీ పార్టీలోకి ఆహ్వానిస్తే వెళతారా? అని మరో ప్రశ్న అడగ్గా… మా మధ్య ఆ టాపిక్ ఎప్పుడూ రాలేదని అనసూయ స్పష్టం చేశారు. దీంతో అనసూయ పొలిటికల్ ఎంట్రీ ఊహాగానాలకు తెరపడింది. ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేసిన అనసూయ ఓటమి చెందారు. మొదట గెలిచాను అన్నారు, తర్వాత ఓడిపోయాను అన్నారు. ఎన్నికల నిర్వహణ మీద అనుమానాలు ఉన్నాయని అనసూయ ఆరోపణలు చేసింది.

    తర్వాత నేను అలాంటి ఆరోపణలు చేయలేదు. మీడియా వక్రీకరిస్తుందని ఆమె ఫైర్ అయ్యారు. ఇక అనసూయ కెరీర్ పరిశీలిస్తే ఆమె జబర్దస్త్ షో ద్వారా పాప్యులర్ అయ్యారు. బోల్డ్ యాంకర్ గా 2022 వరకు ఆ షోలో కొనసాగారు. జబర్దస్త్ షో వదిలేసిన అనసూయ బుల్లితెర షోల మీద ఆరోపణలు చేయడం విశేషం. ఇకపై నా దృష్టి నటన మీదే, యాంకరింగ్ చేయనని ఆమె కుండబద్దలు కొట్టింది.