Anchor Anasuya: తనదైన యాంకరింగ్ తో బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతుంది అనసూయ భరద్వాజ్. అలాగే అవకాశం దొరికినప్పుడల్లా వెండి తెరపై కూడా తన టాలెంట్ ని చూపిస్తుంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన కూడా గ్లామర్ విషయంలో స్టార్ హీరోయిన్లలకు ఏ మాత్రం తగ్గకుండా పోటీ పడుతుంది అనసూయ. సోషల్ మీడియాలో పలు అంశాలపై రియకట్ అవుతూ అప్పుడప్పుడు వార్తల్లో కూడా నిలుస్తూ ఉంటారు. ఇప్పుడు తాజా ఆమె ఓ సీనియర్ నటుడిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.

యాంకరింగ్ లో మెప్పిస్తు ప్రేక్షకులను ఆకట్టుకునే అనసూయకు … ఒక విషయంలో మాత్రం ఎప్పుడు కామెంట్స్ ఎదురవుతూ ఉంటున్నాయి. ఆమె డ్రెస్సింగ్ పై చాలా రోజులుగా విమర్శలు వస్తునే ఉన్నాయి. ఇద్దరు పిల్లల తల్లి అయ్యి ఉండి, ఆ బట్టలు ఏంటి… ఆ ఎక్స్ పోజింగ్ ఏంటి అంటూ నెటిజన్లు సోషల్ మీడియా లో ట్రోల్స్ చేస్తూనే ఉంటున్నారు. తాజాగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ… అనసూయ డ్రెస్సింగ్ పై సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనసూయ మంచి డ్యాన్సరే కాక మంచి నటి అని… అయితే ఆమె వేసుకునే బట్టలు మాత్రం తనకు నచ్చవని కామెంట్ చేశారు. అనసూయ లాంటి అందమైన అమ్మాయి ఎలా ఉన్నా జనాలు చూస్తారు. అందుకే అలాంటి బట్టలు వేసుకోవాల్సిన పనిలేదు. ఆమె చక్కటి నటి. కానీ ఆమె డ్రెస్సింగ్ నాకు నచ్చదు అని పేర్కొన్నారు. ప్రస్తుతం కోట చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరలవుతుంది. ఈ వ్యాఖ్యలపై అనసూయ కాస్త ఘాటుగానే స్పందించారు. అయితే పేరు ఎక్కడ చెప్పుకుండా… ఓ సీనియర్ నటుడు తన డ్రెసింగ్ పై కామెంట్స్ చేశారు అంటూ మండిపడ్డారు.