https://oktelugu.com/

OTT Releases : పనోడితో యజమాని భార్య ఎఫైర్, ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్… ఎక్కడ చూడొచ్చంటే?

అంచక్కల్లకొక్కమ్ మూవీ అడుగడునా ఊహించని ట్విస్ట్స్ తో సాగుతుంది. మారుమూల గ్రామానికి చెందిన భూస్వామి మర్డర్ చుటూ కథ నడుస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 16, 2024 / 11:29 AM IST

    Anchakkallakokkam movie

    Follow us on

    OTT Realese : అన్ని సినిమాలు థియేటర్లో చూడలేము. ఓ రోజు లేదా పూట సమయం కేటాయించడం అంటే సామాన్య విషయం కాదు. అందుకే ఆడియన్స్ బడా చిత్రాలను మాత్రమే థియేటర్స్ లో చూసేందుకు ఇష్టపడతారు. చిన్న హీరోల సినిమాలు, డబ్బింగ్ సినిమాలను థియేటర్స్ లో చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఓటీటీ వచ్చాక ఆ బాధలేదు. విషయం ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్లను ఇంట్లో కూర్చుని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.

    ఇక ఓటీటీ కంటెంట్ కి సెన్సార్షిప్ కూడా తక్కువే. వైలెన్స్, రొమాన్స్ ఇష్టపడే వారు పీక్ కంటెంట్ చూడొచ్చు. అలాంటి ఓ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. లెక్కకు మించిన రొమాంటిక్ సన్నివేశాలతో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. మలయాళంలో తెరకెక్కిన అంచక్కల్లకొక్కమ్ సమ్మర్ కానుకగా మార్చి 15న విడుదలైంది. ఈ మూవీ ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చింది.

    అంచక్కల్లకొక్కమ్ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అంచక్కల్లకొక్కమ్ మూవీ థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ గా ఆడలేదు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఓ మర్డర్ కేసును కొత్తగా కేసును ఎలా ఛేదించాడు అనేదే కథ. పోలీస్ పాత్రను లక్ మాన్ అవరం చేశాడు. ఈ చిత్రానికి ఉల్లాస్ చంబన్ దర్శకుడు.

    అంచక్కల్లకొక్కమ్ మూవీ అడుగడునా ఊహించని ట్విస్ట్స్ తో సాగుతుంది. మారుమూల గ్రామానికి చెందిన భూస్వామి మర్డర్ చుటూ కథ నడుస్తుంది. అసలు భూస్వామిని ఎవరు చంపారు? దాని వెనకున్న కారణం ఏమిటనేది ఆసక్తికరంగా సాగుతుంది. సదరు భూస్వామి భార్య ఇంటి పనోడితో ఎఫైర్ పెట్టుకుంటుంది. ఆ రెండు పాత్రల మధ్య హీటెక్కించే రొమాంటిక్ సన్నివేశాలు జోడించారు. అటు రొమాన్స్, ఇటు థ్రిల్స్ ఎంజాయ్ చేయాలంటే అంచక్కల్లకొక్కమ్ మూవీ మిస్ అవ్వొద్దు.