Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్… ఈ పేరు తెలియని తెలుగు బుల్లితెర ఆడియన్స్ ఉండరు. జబర్దస్త్ వేదికగా ఆమె సంచలనాలు నమోదు చేశారు. ఆమె గ్లామర్ షో హాట్ టాపిక్ అయ్యింది. సాధారణంగా తెలుగు యాంకర్స్ స్కిన్ షో చేసేందుకు ఇష్టపడరు. ఒకవేళ అందుకు సిద్ధమైనా.. ఛానల్స్ ఎంకరేజ్ చేయవు. అనసూయకు ముందున్న సీనియర్ యాంకర్స్ సుమ, ఝాన్సీ, ఉదయభాను తో పాటు మరికొందరు యాంకర్స్ పద్దతిగా కనిపించారు. మోడ్రన్ డ్రెస్సులు ధరించినా శరీరం కనిపించకుండా ఉండేలా చూసుకునేవారు. ఈ సాంప్రదాయాన్ని అనసూయ బ్రేక్ చేసింది.
జబర్దస్త్ షో యాంకర్ గా ఆమె ట్రెండ్ సెట్ చేసింది. అనసూయ అందాల కోసమే షో చూసే సౌందర్య ప్రియులు కూడా ఉండేవారు. 2013లో మొదలైన ఈ షో గ్రాండ్ సక్సెస్. అనసూయ ఒక్కసారిగా స్టార్ యాంకర్స్ లిస్ట్ లో చేరింది. జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. డ్రెస్సింగ్ విషయంలో అనసూయ విమర్శలు ఎదుర్కొంది. కానీ ఆమె పట్టించుకోలేదు. పైగా నా బట్టలు నా ఇష్టం అంటూ.. గట్టిగా ఇచ్చిపడేసింది. జబర్దస్త్ యాంకర్ గా వచ్చిన గుర్తింపు అనసూయకు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. లీడ్ రోల్స్ కూడా చేసిన అనసూయ.. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక రోల్స్ దక్కించుకుంటుంది.
అనసూయ ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె భర్త బీహార్ కి చెందిన వ్యక్తి. పేరు సుశాంక్ భరద్వాజ్. స్కూల్ డేస్ లోనే వీరి ప్రేమ అనుకోకుండా మొదలైందట. అది సుదీర్ఘ కాలం సాగింది. సుశాంక్ తో పెళ్లికి అనసూయ తండ్రి ససేమిరా అన్నారట. లేచిపోయి పెళ్లి చేసుకుందామని కూడా అనసూయ అన్నారట. సుశాంక్ మాత్రం పెద్దల అనుమతితోనే వివాహం జరగాలి, వేచి చూద్దాం అన్నారట. సుశాంక్ తో పెళ్ళి జరగాలని అనసూయ మొక్కులు కూడా మొక్కిందట. తనకు ఎంతో ఇష్టమైన చాక్లెట్స్, ఆలూ… 7 ఏళ్ల పాటు తినలేదట.
చివరకు తండ్రి మనసు మారిందట. సుశాంక్ తో అనసూయకు వివాహం జరిగిందట. వారు ముగ్గురు సిస్టర్స్ అట. అందుకే అబ్బాయి పుడితే బాగుండని అనసూయ కోరుకుందట. మొదటి సంతానం అబ్బాయి పుట్టాడట. రెండోసారి మాత్రం అమ్మాయి పుట్టాలని కోరుకుందట. కానీ మళ్ళీ అబ్బాయి పుట్టడంతో ఒకింత నిరాశ చెందిందట. ఇప్పటికీ ఒక అమ్మాయి ఉంటే బాగుండు అనిపిస్తుంది. 40 ఏళ్ల వయసులో కూడా ఆడపిల్ల కోసం తల్లిని అయ్యేందుకు సిద్ధం అని ఆమె అన్నారు.