https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : ట్రోల్ చేసిన వారికి మరోసారి తన సత్తా చాటిన అవినాష్..షో మొత్తం అతని చుట్టే..ఇది మామూలు డామినేషన్ కాదు!

ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఆడియన్స్ ఓటింగ్ తో కాకుండా తన ఆట తీరుతో టాప్ 5 లోకి అడుగుపెట్టిన ఏకైక కంటెస్టెంట్ అవినాష్.

Written By:
  • Vicky
  • , Updated On : December 10, 2024 / 10:03 AM IST

    Avinash

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఆడియన్స్ ఓటింగ్ తో కాకుండా తన ఆట తీరుతో టాప్ 5 లోకి అడుగుపెట్టిన ఏకైక కంటెస్టెంట్ అవినాష్. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన అవినాష్, అతి తక్కువ నామినేషన్స్ ని ఎదురుకొని, కేవలం తనకి ఉన్న లక్కుతో టాప్ 5 లోకి అడుగుపెట్టాడని సోషల్ మీడియా లో పాత కంటెస్టెంట్స్ అభిమానులు అవినాష్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది అయితే అతన్ని చెప్పుకోలేని భాషలో అడ్డమైన బూతులు తిడుతున్నారు. ముఖ్యంగా టాప్ 6 స్పాట్ లో ఎలిమినేట్ అయిన విష్ణు ప్రియ ఫ్యాన్స్ అయితే అవినాష్ మీద ఒక రేంజ్ లో ద్వేషం చూపిస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ టీం కేవలం అవినాష్ ని టాప్ 5 లో పెట్టడం కోసమే విష్ణు ప్రియ ని ఎలిమినేట్ చేసారని ఆవేశంతో ఊగిపోతున్నారు.

    వాళ్ళ ఆవేశం లో అర్థం ఉంది. ఎందుకంటే ప్రతీ సీజన్ లో చివరి వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండేది. టాప్ 6 కంటెస్టెంట్స్ లో అప్పటి వరకు తక్కువ ఓటింగ్ ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేసి టాప్ 5 కంటెస్టెంట్స్ ని ఫినాలే ఎపిసోడ్ కి పంపేవారు. కానీ ఈసారి అది జరగలేదు. ఎందుకంటే టాప్ 6 కంటెస్టెంట్స్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే కచ్చితంగా తక్కువ ఓటింగ్ ఉన్నటువంటి అవినాష్ మధ్యలో ఎలిమినేట్ అయ్యేవాడు, విష్ణుప్రియ ఫినాలే కి వెళ్లి ఉండేది. ఇక్కడ విష్ణు ప్రియ విషయంలో బిగ్ బాస్ టీం చేసింది అన్యాయమే. కేవలం విష్ణు ప్రియ విషయం లో మాత్రమే కాదు, పృథ్వీ అవినాష్ విషయంలో పృథ్వీ కి కూడా అన్యాయం జరిగింది. ఆయన అభిమానులు కూడా అవినాష్ మీద ఫైర్ తో ఉన్నారు. కానీ అవినాష్ టాప్ 5 లో ఉండడానికి అన్ని విధాలుగా అర్హతలు ఉన్నవాడు.

    వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టడం వల్ల అతనికి ఆడియన్స్ సపోర్ట్ మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే తక్కువ ఉండొచ్చు, కానీ టాప్ 5 కంటెస్టెంట్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ అవినాష్ లో ఉన్నాయి. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించడమే కాకుండా, టాస్కులు కూడా అద్భుతంగా ఆడి తన సత్తా ఏంటో చూపించాడు. రెండు సార్లు మెగా చీఫ్ అవ్వడం, టికెట్ టు ఫినాలే అవ్వడంలో బిగ్ బాస్ అవినాష్ కి ఎలాంటి సహాయం చేయలేదు. కేవలం తన కష్టం మీదనే గెలుచుకున్నాడు. నిఖిల్, గౌతమ్, నబీల్ లాంటి తోపు కంటెస్టెంట్స్ ని ఓడించి గెలిచాడు. అలాంటి కంటెస్టెంట్ కి బిగ్ బాస్ టీం 5 శాతం మాత్రమే పుష్ ఇచ్చింది. అంతే కాదు ఈ సీజన్ అవినాష్ ఇచ్చినంత టీఆర్ఫీ కంటెంట్ ఏ కంటెస్టెంట్ కూడా ఇవ్వలేదట, నిన్న ఒక్కసారి అవినాష్ లేకపోతే ఎపిసోడ్ ఎలా ఉండేదో ఊహించుకోండి, విష్ణు ప్రియ ని బయటకి పంపి అవినాష్ ని టాప్ 5 లోకి పంపడానికి ఇదే ప్రధాన కారణం. అతన్ని ట్రోల్ చేసే వాళ్లకి ఇంతకంటే బలమైన సమాధానం ఇంకేమి కావాలి.