Anasuya Bharadwaj Tweet: ‘జబర్థస్త్’ యాంకర్ గా తన అందచందాలతో ప్రేక్షకులను అలరించి ఫుల్ క్రేజ్ ను సంపాదించింది ఆల్ టైం బ్యూటీ ‘అనసూయ’. మొత్తానికి బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫుల్ డిమాండ్ తో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. అయితే, తాజాగా అనసూయ మహిళా దినోత్సవాన ట్రోలర్స్‌కి షాకిచ్చేలా ట్వీట్ చేసింది.

‘సడెన్ గా ఈ రోజు ప్రతి ట్రోలర్, మీమ్ మేకర్ మహిళలను గౌరవిస్తున్నారు. ఇది 24 గంటలే. అందుకే మహిళలు దూరంగా ఉండండి.. హ్యాపీ ఫూల్స్ డే” అంటూ ట్వీట్ చేసింది. దీంతో అనసూయపై పలువురు కామెంట్లు చేస్తున్నారు. అందరు పురుషులు ఒకేలా ఉండరు.. అది గుర్తుంచుకోండి అంటూ కొందరు కామెంట్లలో హితవు చెబుతున్నారు.
Also Read: ఆ హీరోయిన్ని కొట్టి రూమ్ లో బంధించేవాడట
ఏది ఏమైనా ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గేదేలే అంటుంది అనసూయ. తరచుగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. రీసెంట్ గా టైట్ జీన్స్ , స్ట్రైప్స్ షర్ట్ లో కిరాక్ ఫోజులిచ్చింది. షర్ట్ కి ప్యాంటుకి చిన్న గ్యాప్ ఇచ్చి నడుము అందాల రుచి చూపించింది. మామూలుగానే మనసులు దోచేసే అనసూయను అలా చూసి మగాళ్లు ఊరుకుంటారా.. తోచిన కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు.

ఇక అనసూయ పుష్ప మూవీలో దాక్షాయణి అనే రోల్ చేసింది. అలాగే రవితేజ ఖిలాడిలో కూడా కీలక పాత్రలో నటించింది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేస్తోంది.
Also Read: ‘సలార్’ గురించి అదిరిపోయే సీక్రెట్ చెప్పిన ప్రభాస్
[…] Also Read: Anasuya Bharadwaj Tweet: ట్రోలర్స్ కి షాకిచ్చేలా ట్… […]