Homeఎంటర్టైన్మెంట్Anasuya Online Scam: వారి చేతిలో మోసపోయిన అనసూయ... సంచలనంగా సోషల్ మీడియా పోస్ట్

Anasuya Online Scam: వారి చేతిలో మోసపోయిన అనసూయ… సంచలనంగా సోషల్ మీడియా పోస్ట్

Anasuya Online Scam: సోషల్ మీడియాలో అనసూయ(Anasuya Bharadwaj) చాలా యాక్టీవ్ గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలు, సామాజిక విషయాలపై భావనలు పంచుకుంటారు. విషయం ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే అనసూయకు ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. అనసూయ డోంట్ కేర్ యాటిట్యూడ్ విమర్శలపాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో అనసూయను ట్రోల్ చేసే హేటర్స్ కి కొదవేలేదు. ఎవరు ఏమనుకున్నా అనసూయ అసలు తగ్గదు. తనను విమర్శించే వాళ్ళు మరింత కుళ్ళుకునేలా ఆమె చర్యలు ఉంటాయి.

ఒక పరిధి దాటి ట్రోల్ చేస్తే సహించదు. సైబర్ కేసులు పెడుతుంది. అనసూయపై అనుచిత కామెంట్స్ చేసి జైలుపాలైన ఆకతాయిలు కూడా ఉన్నారు. అందుకే అనసూయ జోలికి పోవాలంటే కొంచెం ధైర్యం కావాలి. అలాంటి అనసూయను మోసం చేశారట. ఈ విషయాన్ని అనసూయ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. మేటర్ లోకి వెళితే… అనసూయ ఓ ఆన్లైన్ సంస్థలో షాపింగ్ చేసింది. ఆర్డర్ తో పాటు డబ్బులు కూడా చెల్లించింది. అయితే నెల రోజులు గడుస్తున్నా ప్రొడక్ట్ రాలేదట. సదరు సంస్థ ప్రతినిధులను పలుమార్లు సంప్రదించినా ఫలితం లేదట.

Also Read: Kota Srinivasa Rao Final Role: కోట శ్రీనివాసరావు చివరగా నటించింది హరిహర వీరమల్లు లోనేనా..?

తాను ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ పంపకపోవడంతో పాటు డబ్బులు కూడా రీఫండ్ చేయలేదట. ఇది దోపిడీతో సమానం అని అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సంస్థలను నమ్మొద్దు. వస్తువులను కొనుగోలు చేయవద్దని అనసూయ హెచ్చరించింది. ఇక అనసూయను మోసం చేసిన ఆ సంస్థ పేరు truffle india అని తెలుస్తుంది. అదన్నమాట సంగతి. ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే నటిగా ఫుల్ బిజీగా ఉన్నారు. విలక్షణ పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది.

ఇటీవల బుల్లితెర రీఎంట్రీ కూడా ఇచ్చింది. దాదాపు రెండేళ్లు టెలివిజన్ షోలకు అనసూయ దూరమైంది. ఇకపై షోలు చేయనని ఓ సందర్భంలో చెప్పడం విశేషం. ఒట్టు తీసి గట్టుమీద పెట్టిన అనసూయ కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోతో పూర్తి స్థాయిలో రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 ముగిసింది. డ్రామా జూనియర్స్ షోలో ప్రస్తుతం అనసూయ సందడి చేస్తుంది. ఆమె బుల్లితెర అభిమానులు రీఎంట్రీని ఎంజాయ్ చేస్తున్నారు.

Exit mobile version