Homeఎంటర్టైన్మెంట్Anasuya: విజయ్ దేవరకొండను మళ్ళీ గెలికిన అనసూయ... సంచలనంగా లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్

Anasuya: విజయ్ దేవరకొండను మళ్ళీ గెలికిన అనసూయ… సంచలనంగా లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్

Anasuya: అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య వివాదం ఇప్పటిది కాదు. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ టైం లో అనసూయ విజయ్ దేవరకొండపై విరుచుకుపడింది. అర్జున్ రెడ్డి సినిమాకు వ్యతిరేకంగా డిబేట్లు పెట్టింది. దర్శకుడు సందీప్ వంగ పై కూడా విమర్శలు చేసింది. సినిమాలో వాడిన బూతులు, హీరోయిన్ ని హీరో కొట్టడం పై మీడియా ముఖంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కారణంగా రౌడీ హీరో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. అనసూయ కూడా తగ్గకుండా వాళ్ళతో యుద్ధానికి దిగింది.

అప్పట్లో అనసూయ, విజయ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో మాటల తూటాలు పేలాయి. కాగా మొన్నామధ్య విజయ్ దేవరకొండతో వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు అనసూయ చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇంతలోనే మరో వివాదం తెరపైకి తెచ్చింది. తాజాగా అనసూయ పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలను విమర్శిస్తూ ఒక పోస్ట్ పెట్టింది.

నటి పార్వతి చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేసింది. గతంలో పార్వతి, దీపికా పదుకొనె ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్వతి మాట్లాడుతూ .. అర్జున్ రెడ్డి కావొచ్చు, కబీర్ సింగ్ కావొచ్చు. ప్రేమను వ్యక్తం చేయడానికి కొట్టడం ఏంటి .. ఇది హింసను ప్రేరేపించడమే. ఇలాంటి సీన్స్ చేయకుండా దర్శకులని మనం ఆపలేకపోవచ్చు. కానీ నటులుగా మనం అలాంటి చిత్రాలు చేయకుండా ఉండగలం కదా .. అని అన్నారు.

పార్వతి కామెంట్స్ ని ఉద్దేశిస్తూ .. అనసూయ ఈ వీడియో అందరూ షేర్ చేయండి. అలాగే మంచిని చెప్పేందుకు ముందుకు వచ్చిన పార్వతి, దీపికా పదుకొనె, ఆయుష్మాన్ వంటి వారిని అభినందించండి. సినిమా అనేది అత్యంత ప్రభావితం చేసే మాధ్యమం అని నటులు, ప్రేక్షకులు తెలుసుకోవాలి. నేను ఇదే విషయం చెప్పినందుకు నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. నాకు మద్దతు ఇచ్చేనందుకు స్ట్రాంగ్ పీఆర్ టీములు, మీడియా లేదు. నేను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పలేను. అయినా కూడా నేను ఆగను ..కొనసాగిస్తూనే ఉంటాను అని అనసూయ కామెంట్ చేశారు. దీంతో అనసూయ, విజయ్ దేవరకొండతో గొడవకు కాలు దువ్వినట్లు అయ్యింది.

RELATED ARTICLES

Most Popular