Anasuya Bharadwaj: అనసూయ మరో వివాదంలో చిక్కుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా అనసూయ చేసిన పనికి నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూ బూతులు తిడుతున్నారు. ఇంతకీ అనసూయ ఏమి చేసింది అంటే.. రిపబ్లిక్ డే విషెస్ చెబుతూ వందేమాతరం గీతాన్ని కూర్చొని ఆలపించింది. దీనిపై నెటిజన్లు ‘పాటను పాడేటప్పుడు ఎందుకు నిల్చోలేదు. టీ షర్ట్ పై గాందీ బొమ్మ ఎందుకు ధరించావ్’ అని కామెంట్ చేశారు.

దీని పై అనసూయ ‘ఏందిరా బై మీ లొల్లి’ అంటూ రియాక్ట్ అయింది. అలాగే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా నెటిజన్లు మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. అంతే ధీటుగా అనసూయ పై విరుచుకు పడుతూ లాజికల్ కామెంట్స్ తో సీరియస్ అయ్యారు. మొత్తమ్మీద ట్రోల్స్ తగ్గకపోవడంతో చివరికి సారీ చెప్పేసింది. ఇక అనసూయ మాత్రం ఇలాంటి విషయాలను అసలు పట్టించుకొను అంటుంది.
Also Read: ఏపీ నడిబొడ్డున త్రివర్ణ జెండా ఎగరనీయని జగన్.. జాతీయ స్థాయిలో రచ్చ
చాలా మందికి తనను చూస్తే అసూయ అంటుంది అనసూయ. తన సక్సెస్ చూసి చాలా మంది ఈర్ష్య పడతారు అని, ఇద్దరు పిల్లల తల్లి అయిన తనలో అసలు గ్లామర్ తగ్గకపోవడాన్ని చాలామంది జీర్ణయించుకోలేకపోతున్నారని అనసూయ తెగ ఇదైపోతుంది.

,ఏది ఏమైనా తనకున్న గ్లామర్ డాల్ ఇమేజ్ అందరికీ రాదు అంటుంది. తన అందంతో ఇండస్ట్రీని షేక్ చేస్తూనే ఉంటాను అని చెబుతుంది. మొత్తమ్మీద వరుస ఆఫర్స్ తో రేసుగుర్రంలా కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది అనసూయ. మొత్తానికి అనసూయ ఎక్కడా వెనక్కి తగ్గేదే లే అంటూ దూసుకుపోతుంది.
Also Read: S ఫుల్ స్వింగ్ లో సమంత.. హిందీ స్టార్ల సరసన కూడా
View this post on Instagram