Homeఎంటర్టైన్మెంట్అనసూయ షార్ట్స్ వేసుకోవడం.. జబర్ధస్త్ లో అవమానం

అనసూయ షార్ట్స్ వేసుకోవడం.. జబర్ధస్త్ లో అవమానం

Anasuya hurts after anchor Shiva question‘అనసూయ’ అందంగా కనిపించడానికి కాస్త ఎక్కువ మేకప్ వేసుకుంటుంది ? అంతమాత్రానికే ఆమె పై ట్రోలింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ? ఏ..? హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ చేయడం లేదా ? వాళ్ళను ఎందుకు మొత్తం కప్పుకోమని చెప్పరు. అనసూయ అంటే టీవీ నుండి వెండితెర పైకి ఎదిగింది కాబట్టి, కింద స్థాయి నుండి ఎదిగిన అమ్మాయి కాబట్టి.. ఈ సమాజానికి ఆమె అంటే చులకన భావమా ?, లేకపోతే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆమె పై ఎందుకు ట్రోలింగ్ జరుగుతుంది ?

ముఖ్యంగా అనసూయ వస్త్రధారణపై ఎప్పుడూ విమర్శలు చెలరేగుతూనే ఉంటాయి. అనసూయ ఎక్స్ పోజింగ్ కోసం లక్షలాది యూత్ ఎదురుచుస్తున్నారు అని ఎందుకు భావించకూడదు. అయినా ఎక్స్ పోజింగ్ అనేది ఆమె వ్యక్తిగత విషయం, ఇదే విషయాన్ని అనసూయ కూడా చెప్పింది. కానీ, ఈ విషయం చెప్పగానే జబర్దస్త్ వేదిక పైనే ఆమెకు అవమానం జరిగింది.

అసలు జబర్దస్త్ అనేది అనసూయకు పుట్టినిల్లు లాంటిది. అలాంటి చోటే ఆమెను హేళన చేస్తారా ? నిజమే, హాట్ మూమెంట్స్ తో జబర్దస్త్ స్టేజ్ ను వేడెక్కిస్తూ ముందుకు పోతుంది అనసూయ. కానీ చివరకు ఆ జబర్దస్త్ వేదికపైనే అనసూయ పరువు పోయింది. హైపర్ ఆది తన టీమ్ లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యక్తుల్ని తీసుకొస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఈ సారి యూట్యూబ్ యాంకర్ శివను గెస్ట్ గా తీసుకొచ్చాడు.

అతగాడు వస్తే వచ్చాడు, నీతులు చెప్పడం దేనికి ? అసలు నీతులు సూక్తులు చెప్పే స్థాయి ఈ దిగువస్థాయి యాంకర్ కి ఉందా ? అనసూయ స్టార్ డమ్ లో అణువు అంత కూడా విలువ లేని ఈ యాంకర్ ‘ఎందుకలా చిన్న చిన్న దుస్తులు వేసుకుంటావు’ అని అనసూయను అడగడం ఏమిటి ? అప్పటికీ అది తన వ్యక్తిగత విషయం అని అనసూయ సిగ్గు లేకుండా చెప్పినా, అలాంటప్పుడు ఇంట్లో వేసుకోవాలి, ఇలా స్టేజ్ పై కాదంటూ ఇతగాడు అనసూనే ను దారుణంగా అవమానిస్తాడా ? ఏంటో పాపం అనసూయ తన అందంతో ప్రేక్షకులను సంతృప్తి పరుస్తున్నా.. ఆమెకు అవమానాలు మాత్రం తప్పడం లేదు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular