https://oktelugu.com/

Anchor Anasuya: అనారోగ్యంతో అనసూయ తండ్రి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న అనసూయ!

Anchor Anasuya: జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇంట విషాద ఘటన చోటుచేసుకుంది.అనసూయ తండ్రి సుదర్శన రావు అనారోగ్య సమస్యతో నేడు తుది శ్వాస విడిచారు.ఇలా అనారోగ్య సమస్యతో బాధపడుతూ తన తండ్రి మరణించారన్న వార్త తెలుసుకున్న అనసూయ తీవ్ర భావోద్వేగానికిలోనై కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో వరుసగా మరణ వార్తలు చోటుచేసుకోవడంతో అందరూ ఎంతో షాక్ అవుతున్నారు. ఇప్పటికే శివ శంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్త నుంచి కోలుకోక ముందే కిరణ్ అబ్బవరం సోదరుడు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 5, 2021 / 01:57 PM IST
    Follow us on

    Anchor Anasuya: జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇంట విషాద ఘటన చోటుచేసుకుంది.అనసూయ తండ్రి సుదర్శన రావు అనారోగ్య సమస్యతో నేడు తుది శ్వాస విడిచారు.ఇలా అనారోగ్య సమస్యతో బాధపడుతూ తన తండ్రి మరణించారన్న వార్త తెలుసుకున్న అనసూయ తీవ్ర భావోద్వేగానికిలోనై కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో వరుసగా మరణ వార్తలు చోటుచేసుకోవడంతో అందరూ ఎంతో షాక్ అవుతున్నారు. ఇప్పటికే శివ శంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్త నుంచి కోలుకోక ముందే కిరణ్ అబ్బవరం సోదరుడు మరణవార్త తెలిసింది. నేడు అనసూయ తండ్రి మరణవార్త తెలియడంతో అందరూ షాక్ అయ్యారు.

    ఈ క్రమంలోని అనసూయ తండ్రి మరణవార్త తెలుసుకున్న కొందరు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గత కొంత కాలం నుంచి మధుసూదనరావు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తుది శ్వాస విడిచారు. ఈ ఘటన ఘటన హైదరాబాద్ లోని తార్నాకలో చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే అనసూయ తన షెడ్యూల్స్ క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన తన తండ్రిని చూడటానికి బయలుదేరింది.

    ఇక అనసూయ తండ్రి సుదర్శన్ రావు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈయన నేడు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందడంతో అనసూయ విషాదం నెలకొంది.ఇక ఈ విషయం తెలిసిన కొందరు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ యాంకర్ అనసూయ ఫోన్లో పరామర్శించారు.అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ తన వివాహానికి తన తండ్రి అడ్డుపడ్డారన్న విషయం తెలియజేశారు.భరద్వాజ్ ను పెళ్లి చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేదని ఐదు సంవత్సరాల పాటు తన తండ్రి నిర్ణయం కోసం ఎదురు చూసి చివరికి తన తండ్రి అంగీకారంతో పెళ్లి చేసుకున్నానని వెల్లడించారు.