Akhanda Movie Bulls: అఖండ మూవీలో ఉన్న ఎద్దులు ఎవ‌రివి..? వాటి ప్ర‌త్యేక‌త‌లేంటి..?

Akhanda Movie Bulls: నందమూరి నటసింహం బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘అఖండ’ బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా చూసేందుకు అఘోరాలు సైతం థియేటర్స్ వద్దకు వస్తున్నారు. ఇక నందమూరి అభిమానులు అయితే ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్‌ బోయపాటి శ్రీనుకు థాంక్స్ చెప్తూ..ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లోనే ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు అందుకున్న మూవీగా నిలిచింది. ఈ సినిమాలో ప్రతీ సీన్ […]

Written By: Neelambaram, Updated On : December 5, 2021 1:58 pm
Follow us on

Akhanda Movie Bulls: నందమూరి నటసింహం బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘అఖండ’ బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా చూసేందుకు అఘోరాలు సైతం థియేటర్స్ వద్దకు వస్తున్నారు. ఇక నందమూరి అభిమానులు అయితే ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్‌ బోయపాటి శ్రీనుకు థాంక్స్ చెప్తూ..ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లోనే ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు అందుకున్న మూవీగా నిలిచింది. ఈ సినిమాలో ప్రతీ సీన్ బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా బోయపాటి శ్రీను డిజైన్ చేశారు. యాక్షన్ సీన్స్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో ఫైట్ సీక్వెన్స్‌లలో బసవన్నలు (కోడెలు) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ బసవన్నలు ఎక్కడివి..వాటికి ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చారనే విషయాలు తెలుసుకుందాం.

Akhanda Movie Bulls

‘అఖండ’ సినిమా బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా. ఇందుకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాల పండుగ మొదలైందని సినీ పరిశీలకులు పేర్కొంటున్నారు. బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబోలో గతంలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలను మించి ఈ సినిమా సక్సెస్ అవబోతున్నదని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా చూసి సినీ అభిమానులు ‘జై బాలయ్య’ అని నినదిస్తున్నారు. సినిమాలో గిత్తలకు(బసవన్నలు) సంబంధించిన సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. సోషల్ మీడియాలో బసవన్నల ఫొటోలు తెగ వైరలవుతున్నాయి.

Also Read: ఏఎన్​ఆర్​ను ఇమిటేట్​ చేసిన బాలయ్య.. నెట్టింట్లో వీడియో వైరల్

అఖండ చిత్రంలో బాలకృష్ణ ఎంట్రీ, క్లైమాక్స్‌లో బసవన్నలు హైలైట్‌గా నిలిచాయి. ఈ కోడెలు తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా చౌటుప్ప ల్‌ మండలం లక్కారం గ్రామానికి చెందినవి. నూనె శ్రీనివాస్‌ అనే రైతుకు చెందిన ఈ కోడెలకు కృష్ణుడు, అర్జునుడు అనే పేర్లున్నాయి. వీటికి వివిధ అంశాలపై ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సినిమాలో ఎద్దులకు సంబంధించిన చర్చ వచ్చినపుడు నూనె శ్రీనివాస్ తన కోడెల గురించి డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు వివరించాడు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో డైరెక్టర్ బోయపాటి శ్రీను బసవన్నలతో కొన్ని టెస్టింగ్ సీన్స్ చేశారు. అవి ఫైనల్ అయ్యాక నందమూరి బాలకృష్ణ సైతం సినిమాలో వాటితో నటించేందుకు ఓకే చెప్పాడు. అలా రెండు రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో బాలయ్యతో బసవన్నలు యాక్ట్ చేశాయి. యాక్షన్ సీన్స్‌లో బాలకృష్ణను కాపాడే సీన్‌లో బసవన్నలు తమ బలాన్ని ప్రదర్శించాయి.

డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆలోచన ప్రకారం మూగజీవాలైన బసవన్నలు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయి. సిల్వర్ స్క్రీన్‌పైన బసవన్నలతో బాలయ్య సీన్స్ చాలా స్పెషల్‌గా ఉన్నాయని నందమూరి అభిమానులు పేర్కొంటున్నారు. ఇక ఈ బసవన్నల ఓనర్ అయిన నూనె శ్రీనివాస్ తన కోడెలు తన అభిమాన కథనాయకుడు బాలకృష్ణతో కనిపించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

Also Read: ఇండియన్​ ఆర్మీని కాదనుకుని.. ‘అఖండ’లో విలన్​గా?

Tags