Anasuya: అనసూయ భరద్వాజ్ అనండం కంటే… జబర్దస్త్ అనసూయ అంటే ప్రేక్షకులు త్వరగా గుర్తు పట్టగలరు ఎందుకంటే అంత క్రేజ్ తెచ్చిపెట్టింది జబర్దస్త్ అనసూయకి అని చెప్పాలి. అటు యాంకర్ గా ఇటు సినిమాల్లో మంచి గుర్తింపు పొందారు అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర తన సినిమా కెరియర్ ను మార్చింది అనే చెప్పాలి. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో ఒక కీలకమైన పాత్రలో చేస్తున్నారు అనసూయ. అంతేకాకుండా కోలీవుడ్ లో కూడా తన సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ అమ్మడు.

Also Read: “పుష్ప” సినిమా నుంచి మరో అప్డేట్ ను ప్రకటించిన చిత్ర బృందం…
తమిళ దర్శకుడు డాన్ శాండీ తెరకెక్కిస్తున్న చిత్రం”ఫ్లాష్ బ్యాక్ ” కొరియోగ్రాఫర్, దర్శకుడు,నటుడు ప్రభుదేవా లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో రెజీనా కసాండ్రా, అనసూయ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి అభిషేక్ ఫిలిమ్స్’ బేనర్ మీద రమేష్ పిళ్లై నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా సామ్ సీఎస్ పనిచేస్తున్నారు. ఈ సినిమా లో అనసూయ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.
“ఫ్లాష్ బ్యాక్” అనే టైటిల్ అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళ వెర్షన్ పోస్టర్ లో అనసూయ పేరును జోడించే లేదు ఎందుకంటే ఆమెకు అక్కడ అంతగా గుర్తింపు లేకపోవడం వల్ల తన పేరు పోస్టర్ మీదికి ఎక్కలేదేమో అని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు వెర్షన్ పోస్టర్లలో ఆమె పేరును జోడించారు చిత్ర బృందం. తెలుగులో రంగస్థలం సినిమాకు దక్కిన ఆదరణ అలాంటి విజయాన్ని.. కోలీవుడ్ సినిమా లో కూడా అందుకుంటుందో లేదో చూడాలి మరి ఈ భామ.
Also Read: తెలుగు టాప్ యాంకర్లు ఏం చదువుకున్నారో తెలిస్తే అవాక్కే!