Anasuya : యాంకర్ గా, సినీ నటిగా అశేష ప్రేక్షకాభిమానం పొందిన అనసూయ(Anasuya Bharadwaj) గురించి మన అందరికీ తెలిసిందే. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా కెరీర్ ని ప్రారంభించిన ఈమె, ఆ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో మరికొన్ని టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరించి, ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు సంపాదించి నేడు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది. యూత్ లో ఈమెకు మొదటి నుండి మంచి క్రేజ్ ఉంది. హీరోయిన్ రేంజ్ కటౌట్ కానీ, ఎందుకో ఎక్కువగా విలన్ క్యారెక్టర్స్ ఆమెకు వస్తుంటాయి. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో అనసూయ ఎంత యాక్టీవ్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గా ఈమె కొత్త ఇల్లు కట్టుకుంది. అందులో ఆమె తన భర్తతో కలిసి గృహ ప్రవేశం చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యింది.
Also Read : శేఖర్ మాస్టర్ పై అనసూయ ఫైర్..కంట్రోల్ లో ఉండు అంటూ వార్నింగ్!
ఆమె మాట్లాడుతూ ‘ఆ సీతారామాంజనేయ కృపతో, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం తో మా జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఎంతో ఇష్టం తో కట్టుకున్న ఈ ఇంటికి ‘శ్రీరామ సంజీవని’ అని పేరు పెట్టుకున్నాము. నేడు గ్రాండ్ గా గృహ ప్రవేశం చేస్తున్నాము. మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉండాలి’ అంటూ చెప్పుకొచ్చింది అనసూయ. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఈ ఫోటో కి సంబంధించి కొన్ని విషయాలను మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ నెల 3న మేము మా కొత్త ఇంట్లో పూజలు, హోమాలు, సత్యనారాయణ వ్రతం మరియు ఇతర ముఖ్యమైన పూజలు జరుపుకున్నాం. హోమం మొదలు పెట్టె ముందు మేము మా గురువు గారికి ఈ ఇంటికి ‘సంజీవని’ అని పేరు పెట్టాలని అనుకుంటున్నాము అని చెప్పాము. ఆయన ‘శ్రీ రామ సంజీవని’ అని పెట్టమని చెప్పారు. మాకు అద్భుతంగా అనిపించింది. సరే గురువు గారు అని సంతోషంతో చెప్పాము. అదే పేరు పెట్టుకున్నాము. హోమం జరుగుతున్న సమయంలో 20 నిమిషాల తర్వాత మా గురువు గారు ఆంజనేయుడు వచ్చాడు అని అన్నారు’ అంటూ చాలా ఎమోషనల్ గా ఆమె ఈ పోస్ట్ వేసింది.
ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే ఒకప్పటి లాగా ఇప్పుడు ఆమె యాంకరింగ్ చేయడం లేదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ‘జబర్దస్త్’ షో లో మాత్రం కొనసాగుతూ ఉండేది. కానీ 2023 నుండి ఆ షో కూడా మానేసింది. అలా బుల్లితెర కి బాగా దూరమైన అనసూయ రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో ప్రతీ వారం ప్రసారం అవుతున్న ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్’ సీజన్ 2 లో ఆడవాళ్ళ తరుపున గేమ్ చేంజర్ గా వ్యవహరిస్తోంది. ఈ షో ఇప్పుడు టాప్ టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది.
Also Read : ఆకాశాన్ని డ్రెస్ గా చుట్టేసుకుందా ఏంటి ఈ అనసూయ..