Homeఎంటర్టైన్మెంట్Anasuya : అనసూయ మజాకా... ఏకంగా బికినీలో దర్శనం ఇచ్చిన స్టార్ యాంకర్

Anasuya : అనసూయ మజాకా… ఏకంగా బికినీలో దర్శనం ఇచ్చిన స్టార్ యాంకర్

Anasuya : అనసూయ భరద్వాజ్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. నటిగా ఆమెకు విలక్షణ పాత్రలు దక్కుతున్నాయి. పుష్ప సిరీస్లో అనసూయ నెగిటివ్ రోల్ లో మెప్పించింది. తిరిగి బుల్లితెర ఎంట్రీ కూడా ఇచ్చింది. జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన అనసూయ, దాదాపు రెండేళ్లు టెలివిజన్ షోలు చేయలేదు. గత ఏడాది కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోతో రీఎంట్రీ ఇచ్చింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 1 సక్సెస్ కావడంతో.. సీజన్ 2 సైతం మొదలైంది. స్టార్ మా లో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2లో అమ్మాయిల ప్రతినిధిగా అనసూయ వ్యవహరిస్తోంది.

అదే సమయంలో కుటుంబానికి సమయం కేటాయిస్తుంది. తన ఇద్దరు కుమారులు, భర్తతో ఆహ్లదంగా గడిపేందుకు అనసూయ ఇష్టపడుతుంది. ప్రస్తుతం అనసూయ కుటుంబంతో పాటు శ్రీలంక వెకేషన్ కి వెళ్ళింది. ఇష్టమైన ప్రదేశాలను సందర్శిస్తూ ప్రకృతిలో సేద తీరుతుంది. ఈ క్రమంలో అనసూయ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో జలకాలు ఆడింది. సదరు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ. బికినీ లుక్ షేర్ చేసిన అనసూయ గట్స్ కి జనాలు అవాక్కు అవుతున్నారు. గతంలో కూడా అనసూయ బికినీ లుక్ పంచుకోవడం విశేషం.

Also Read : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

అనసూయ ఇటీవల కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ విలాసవంతమైన ఇంటి ధర రూ. 50 కోట్లు అని ప్రచారం అవుతుంది. మరి ఇదే నిజమైతే అనసూయ స్టార్ హీరోల సరసన చేరినట్లే. అనసూయకు ఉన్న డిమాండ్ రీత్యా ఒక్కో కాల్షీట్ కి రూ. 2 నుండి 3 లక్షలు ఛార్జ్ చేస్తుందట. మరోవైపు బుల్లితెర షోలు చేస్తుంది. ప్రమోషన్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ ద్వారా అనసూయ నెలకు కోట్లలో సంపాదిస్తున్నట్లు సమాచారం.

అనసూయ తరచుగా సోషల్ మీడియా ట్రోలింగ్ కి గురవుతుంది. అనసూయ పోస్ట్స్ కి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవారి సంఖ్య ఎక్కువే. ఆ మధ్య విజయ్ దేవరకొండ అభిమానులతో పెట్టుకుంది అనసూయ. విజయ్ దేవరకొండను విమర్శిస్తూ పోస్ట్స్ పెట్టింది. దాంతో ఆయన అభిమానులు అనసూయను ట్రోల్ చేశారు. సదరు ట్రోల్స్ ని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది అనసూయ. అనంతరం కావాలనే విజయ్ దేవరకొండపై పోస్ట్స్ పెట్టినట్లు ఒప్పుకుంది. ఇకపై ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు వెల్లడించింది.

Exit mobile version