Anasuya Bharadwaj: స్టార్ యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ తన అసలైన అందాలు పరిచయం చేసింది. మేకప్ లెస్ లుక్ ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది. రియల్ గా అనసూయ ఇలా ఉంటారా! అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ చుడిదార్ లో అనసూయ చాలా పద్దతిగా కనిపించారు. దానికి ఒక కారణం కూడా ఉంది. సదరు ఫోటోలు తీసింది వాళ్ళ అబ్బాయిలట. ఫోటోగ్రఫీలో మా అబ్బాయిలు తోపు అంటూ కామెంట్ కూడా యాడ్ చేసింది. అనసూయ మేకప్ లెస్ లుక్ ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.

ఇక అనసూయ గ్లామర్ చూసిన జనాలు ఆమెకు ఇద్దరు పిల్లలంటే అసలు నమ్మలేమంటున్నారు. 37 ఏళ్ల అనసూయ అలా కనిపించదు. అనసూయ కెరీర్లో సెటిల్ కాకముందే పెళ్లి చేసుకున్నారు. భరద్వాజ్ తో ఆమెది ప్రేమ వివాహం. ఇంటర్ లో ఫస్ట్ టైం కలిసిన అనసూయ-భరద్వాజ్ ఏళ్ల తరబడి ప్రేమించుకున్నారు. భరద్వాజ్ తో వివాహానికి అనసూయ తండ్రి ససేమిరా అన్నారట. దాంతో ఇంటి నుండి బయటకు వచ్చేసి హాస్టల్ లో ఉన్నారట.
Also Read: Actress Jeevitha Rajasekhar: జీవితా రాజశేఖర్ జస్ట్ మిస్… కానీ మేనేజర్ దొరికిపోయాడు!

ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి అనసూయ ప్రేమించినవాడి చేయి అందుకుంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు. ఇక నటిగా బిజీ కావడంతో యాంకరింగ్ వదిలేసింది. అనసూయను బుల్లితెర ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. బెటర్మెంట్ కోరుకున్న అనసూయ ఎక్కువ పారితోషికం వచ్చే సినిమాలకు ప్రాధాన్యత ఇస్తుంది. తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ నే వేదిలేసిన అనసూయ… ఇతర ఛానల్స్ లో కూడా కనిపించడం లేదు.

అనసూయ చేతిలో పుష్ప 2 వంటి క్రేజీ ప్రాజెక్ట్ తో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్లు ఉన్నాయి. అనసూయ నటిస్తున్న మరో చెప్పుకోదగ్గ చిత్రం రంగమార్తాండ. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అనసూయ దేవదాసిగా కనిపిస్తారనే టాక్ ఉంది. కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా అనసూయ అనవసర వివాదాలు టచ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెపై సోషల్ నెగిటివిటీ పెరిగిపోయింది. ఇలాంటి విమర్శలను లెక్క చేయని ఆమె ట్రోలర్స్ ని మరింత రెచ్చగొట్టేలా పోస్ట్స్ పెడుతున్నారు. లైగర్ మూవీని ఉద్దేశిస్తూ నెగిటివ్ ట్వీట్ చేసిన అనసూయను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆంటీ అంటూ ట్రోల్ చేసిన విషయం తెలిసిందే.
[…] […]
[…] […]