Avatar 2 Ticket Price In India: భారీ విజువల్స్ తో కొత్త లోకంలోకి తీసుకెళ్లే ‘అవతార్’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజై ప్రేక్షకుల మది దోచింది. లేటేస్టుగా ట్రైలర్ రిలీజ్ చేయడంతో విపరీతంగా ఆకట్టుకుంటోంది. పార్ట్ 1 కథకు భారీ మార్పులు చేసి అంతకుమించి అన్న స్థాయిలో విజువల్స్ ను జోడించారు. జేమ్స్ కామెరూన్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ మూవీ డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవడంతో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. కొన్ని థియేటర్లలో కళ్లు తిరిగే రేట్లు ఉన్నప్పటికీ అవతార్ ప్రియులు మాత్రం మొదటిరోజే ఈ సినిమాను చూడాలని తహతహలాడుతున్నారు.

Avatar 2
2009 డిసెంబర్ 18న ‘అవతార్’ రిలీజైంది. ఇప్పటికే ఇంగ్లీష్ సినిమాల హవా నడుస్తున్నా ఈ మూవీ ప్రత్యేకత చాటుకుంది. ‘పాండోర’ గ్రహంలో నావీ తెగ జీవిస్తోంది. ఈ గ్రహంలో ఉన్న విలువైన లోహాలను తీసుకొచ్చేందుకు మనుషులు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇందులోకి వెళ్లడం సాధ్యం కాదు. హీరో ఇందులోకి ఎంట్రీ ఇచ్చి వారిని మోసం చేస్తారు. ఆ తరువాత మనుషులు ఎంట్రీ ఇచ్చి వారిని వెళ్లగొడతారు… ఇది మొదటి సినిమా కథాంశం. అయితే దీనికి కంటిన్యూ ఇప్పుడు పార్ట్ 2 రాబోతుంది.
Also Read: Actress Jeevitha Rajasekhar: జీవితా రాజశేఖర్ జస్ట్ మిస్… కానీ మేనేజర్ దొరికిపోయాడు!
తమ నివాసాలు కోల్పోయిన నావీ తెగ ఆ తరువాత ఎక్కడ జీవిస్తుంది..? సముద్రంతో వారికి ఎలాంటి అనుబంధం ఏర్పడుతుంది..? అనేది తరువాత సినిమాలో చూపించారు. అవాతార్ 2 లో సామ్ వర్దింగ్టన్, జోయా సాల్తానా, సిగుర్నే వీవర్, కేట్ విన్స్ లెట్ తదితరులు నటించారు. ఈ సినిమాకు కూడా జేమ్స్ కామెరూన్ డైరెక్షన్ చేశారు. ఇది హిట్టయితే అవతార్ 3, అవతార్ 4 వస్తుందని తెలిపారు. కానీ ఆ సినిమాలకు మాత్రం ఆయన డైరెక్షన్ చేయనని ప్రకటించారు.

Avatar 2
అవతార్ 2 ను ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి ఏడు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. మన దేశంలో ఈ సినిమా టికెట్ల రేట్లు మండిపోతున్నా.. హాట్ కేకుల్లాగా అమ్ముడుపోతున్నాయి. ఒక హాలీవుడ్ సినిమాకు ఇంతలా క్రేజ్ రావడం ఇదే మొదటిసారి. ఈ సినిమాను ఐమాక్స్ 3D, 4DX, 3D ఫార్మట్లలో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడో ఒక్కో షో రేటు విపరీతంగా ఉంది. బెంగుళూర్ లో ఐమాక్స్ టికెట్ ధర రూ.1450 ఉంది. పూణెలో రూ.1200 నిర్ణయించారు. హైదరాబాద్ లో రూ.350 నిర్ణయించారు. అయితే వీటికి పన్నులు అదనం. త్వరలో నార్మల్ థియేటర్లలోనూ టికెట్ ధరలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.