Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj: మాఫియా అంటూ... దేవరకొండను మళ్ళీ గెలికిన అనసూయ, ఈసారి అల్లు అర్జున్ ని...

Anasuya Bharadwaj: మాఫియా అంటూ… దేవరకొండను మళ్ళీ గెలికిన అనసూయ, ఈసారి అల్లు అర్జున్ ని కూడా!

Anasuya Bharadwaj: విజయ్ దేవరకొండతో అనసూయ వివాదం ఇప్పటిది కాదు. అర్జున్ రెడ్డి మూవీ విడుదల నాటి నుంచి ఆమె ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంది. అర్జున్ రెడ్డి మూవీ కంటెంట్ తో పాటు సన్నివేశాలు, విజయ్ దేవరకొండ బూతు డైలాగ్స్ పై అనసూయ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. టీవీ డిబేట్స్ లో కూర్చుని అర్జున్ రెడ్డి మూవీ యూనిట్ పై మండిపడింది. కట్ చేస్తే కొన్నాళ్ళు ఆమె సైలెంట్ గా ఉంది. 2022లో లైగర్ విడుదల కాగా మరలా విజయ్ దేవరకొండను గెలికింది. ఆ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో … తగిన శాస్తి జరిగింది అని అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది.

దాంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఆంటీ అని అనసూయను ట్రోల్ చేశారు. ఖుషి చిత్ర విడుదలకు ముందు కూడా అనసూయ వివాదం రాజేసింది. విజయ్ దేవరకొండ పేరు ముందు ‘ది’ అని పెట్టడాన్ని ఆమె తప్పుబట్టింది. విజయ్ దేవరకొండ మీద సెటైర్ వేస్తూ ట్వీట్ చేసింది. కావాలనే విజయ్ దేవరకొండను టార్గెట్ చేశాను. ఎందుకంటే విజయ్ దగ్గర ఉండే ఓ వ్యక్తి నన్ను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయిస్తున్నాడని తెలిసింది. విజయ్ కి తెలియకుండా అతడు చేయడని నా నమ్మకం. అందుకే విజయ్ కి వ్యతిరేకంగా ట్వీట్స్ వేశాను అన్నారు. అయితే ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు వెల్లడించింది.

అయితే అనసూయ మరలా విజయ్ దేవరకొండపై కామెంట్స్ చేసింది. కార్తీక్ అనే ఓ నెటిజన్… అల్లు అర్జున్ అర్జున్ కంటే దారుణమైనది విజయ్ దేవరకొండ మాఫియా. ప్రచారం కోసం పీఆర్ టీమ్ లు, సింపతీ డ్రామాలు. చివరికి అనసూయ ఆంటీని దింపుతారు, అని అర్థం వచ్చేలా కామెంట్ పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన అనసూయ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది.

అనవసరంగా నన్ను ఎందుకు లాగుతారు కార్తీక్ గారు. ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో నేను చెప్పి చెప్పి వదిలేశాను. నేను కూడా తెలంగాణ బిడ్డనే. నాకు సింపథీ అవసరం లేదు. నా మీద, దేవుడి మీద నమ్మకం. నాకున్న విలువలు, అమ్మానాన్నల పెంపకం ఎప్పుడూ దిగజారనివ్వవు. ఈ ట్వీట్ ని కూడా వాళ్ళు స్వార్ధానికి వాడుకున్నా ఆశ్చర్యం లేదు. నాకు వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. అన్నట్లు నేను మీకు ఆంటీని ఎలా అయ్యానో నాకు తెలియదు. ఎందుకంటే మీరు నా బంధువు కాదు. ఒకవేళ మీకు తెలియకుండా ఏమైనా రిలేషన్స్ ఉన్నాయేమో తెలుసుకోండి. చుట్టాలు అయితే పలకరింపులు ఉంటాయి కదా. మీరు బాగుండాలి, అని అనసూయ కామెంట్ పెట్టింది. తన మాటల్లో విజయ్ దేవరకొండను టార్గెట్ చేసినట్లు క్లియర్ గా తెలుస్తుంది.

Exit mobile version