https://oktelugu.com/

Anasuya Bharadwaj: ఒక కుర్రాడితో రేలషన్ లో ఉన్నట్లు కాలేజీ డేస్ ను గుర్తుచేసుకున్న అనసూయ..

తన అందంతో, యాంకరింగ్ స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే వాళ్లలో అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Written By:
  • Mahi
  • , Updated On : January 6, 2025 / 06:05 PM IST

    Anasuya Bharadwaj

    Follow us on

    Anasuya Bharadwaj: బుల్లితెర మీద చాలామంది యాంకర్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొంతమంది మాత్రమే తమ యాంకరింగ్ తో సత్తా చాటి స్టార్ యాంకర్లుగా ఎదిగారు. అలా స్టార్ యాంకర్ గా తన అందంతో, యాంకరింగ్ స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే వాళ్లలో అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ ఛానల్ ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా అనసూయ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. కొన్ని ఏళ్లపాటు బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా రాణించింది అనసూయ. బుల్లితెర మీద యాంకర్ గా చేస్తూనే మరోపక్క సినిమాలలో కూడా తన టాలెంట్ ను నిరూపించుకోవడానికి సినిమాలలో ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో మెప్పించిన ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాలలో కీలక పాత్రలలో కనిపించింది. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలలో అన్ని కీలకపాత్రలే చేస్తుండడం విశేషమని చెప్పొచ్చు. వరుసగా సినిమాలు చేస్తూ అనసూయ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాలో అనసూయ భరద్వాజ్ రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా లో ఆమె పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. రంగస్థలం సినిమా తర్వాత ఈమెకు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. సినిమాలలో కీలక పాత్రలలో నటించే అవకాశం దక్కించుకుంది అనసూయ.ఆ తర్వాత అనసూయ భరద్వాజ్ పుష్ప మొదటి భాగంలో నటించింది. ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర కొంచెం సేపే అయినప్పటికీ మంచి నటన కనపరిచింది.

    లేటెస్ట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 లో కూడా అనసూయ కీలక పాత్రలో కనిపించింది.ఇక సినిమాలలో నటించడానికి గాను అనసూయ భారీ మొత్తం లోనే రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. వరుసగా సినిమాలతో బిజీగా ఉంటూనే అనసూయ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో చేరువలో ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను, సినిమా అప్డేట్స్, ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. నిత్యం ఈమెకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా అనసూయకు సంబంధించిన ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.

    అనసూయ కాలేజీ చదువుతున్న రోజుల్లో ఒక కుర్రాడితో రిలేషన్ కొనసాగించేదట. అతనిని పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుందట. కానీ కొన్ని కారణాల వలన వారి ఇద్దరి రిలేషన్ బ్రేక్ అయిందని సమాచారం. ఆ తర్వాత అనసూయ భరద్వాజ్, సుశాంక్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. ప్రస్తుతం అనసూయ తన ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. సినిమాల నుంచి గ్యాప్ దొరికిన సమయం లో అనసూయ తన భర్త,పిల్లలతో కలిసి వెకేషన్ లలో ఎంజాయ్ చేస్తుంది.