Thuraka Kishore Arrested: ఏపీలో వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. అయితే ఆ స్థాయిలో అరెస్టులు మాత్రం జరగడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని (pinnelli Ramakrishna Reddy) అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. పల్నాడు లో( Palnadu ) జరిగిన విధ్వంస ఘటనలకు సంబంధించి బాధ్యుడిని చేస్తూ రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. సుదీర్ఘకాలం ఆయన నెల్లూరు జిల్లా జైలులో ( Nellore district jail) రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ పై బయటకు వచ్చారు. ఇప్పుడు తాజాగా ఆయన ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ ( turaka Kishore అరెస్టయ్యారు. హైదరాబాద్ సమీపంలోని మల్కాజిగిరి జయపురి కాలనీలో పోలీసులకు పట్టుబడ్డాడు కిషోర్. అయితే ఆయన అరెస్టు విషయంలో సెన్సేషన్ క్రియేట్ (sensation create) అయ్యింది. దీంతో అంతా ఎవరి తురకా కిషోర్ అంటూ ఆరా తీయడం ప్రారంభించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు అని తేలింది.
* మాచర్లలో విధ్వంసం
ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మాచర్లలో (macherla) విధ్వంసం చోటుచేసుకుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ లో చొరబడి విధ్వంసం సృష్టించారు. ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి రావడంతో ఆ కేసులో అరెస్టయ్యారు రామకృష్ణారెడ్డి. అయితే ఇప్పుడు తాజాగా ఆయన ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ అరెస్టయ్యారు. ఈయన రామకృష్ణారెడ్డికి కుడి భుజం. మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్( ex chairman of municipal ) కూడా. ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకం వెనుక కిషోర్ ఉన్నారు అన్నది ప్రధాన ఆరోపణ. పోలింగ్ బూత్లోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేశారు రామకృష్ణారెడ్డి. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు (videos) కూడా బయటకు వచ్చాయి. దీంతో కొద్దిరోజుల పాటు పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అటు తరువాత పట్టుబడ్డారు. బెయిల్ లభించడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. కానీ కిషోర్ ఆచూకీ మాత్రం లేకుండా పోయింది. ఎట్టకేలకు ఆయన పట్టుబడ్డాడు.
* ఏడు కేసుల్లో నిందితుడు
తురకా కిషోర్ పై ఏడు కేసులు వరకు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టిడిపి, జనసేన తరపున నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను భయపెట్టారు కిషోర్. ఆ సమయంలో పార్టీ పరిశీలకులుగా వచ్చిన టిడిపి నేతలు బొండా ఉమా, బుద్ధ వెంకన్న (bonda Uma, Buddha venkana) కారుపై కూడా దాడికి పాల్పడ్డారు. కారు అద్దాల్లో నుంచి పెద్ద కర్రలతో దాడి చేశారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కిషోర్ కు కష్టాలు మొదలయ్యాయి. బెంగళూరులో కొన్ని రోజులు, హైదరాబాదులో కొన్ని రోజులు ఆయన గడిపినట్లు సమాచారం. చివరకు పోలీసులకు చిక్కడం విశేషం.