Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj New House: ఆర్టీసీ బస్సుల్లో తిరిగిన అనసూయ అన్ని కోట్లు సంపాదించిందా? కొత్త...

Anasuya Bharadwaj New House: ఆర్టీసీ బస్సుల్లో తిరిగిన అనసూయ అన్ని కోట్లు సంపాదించిందా? కొత్త ఇల్లు ధర తెలిస్తే మైండ్ బ్లాక్!

Anasuya Bharadwaj New House: జబర్దస్త్ కామెడీ అనసూయ జీవితాన్ని మార్చేసింది. నటి కావాలని పరిశ్రమలో అడుగుపెట్టిన అనసూయకు అవకాశాలు రాలేదు. దాంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. 2013లో ఈటీవీలో ప్రయోగాత్మకంగా జబర్దస్త్ కామెడీ షో ప్రారంభమైంది. ఈ షోకి యాంకరింగ్ చేసే ఛాన్స్ అనసూయకు దక్కింది. అది ఆమె కెరీర్ ని అనుకోని మలుపు తిప్పింది. స్టార్ ని చేసింది. అనసూయ ఒకప్పటి జీవితం గమనిస్తే.. ఆమె మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. పిల్లలను కష్టపడి పేరెంట్స్ చదివించారట. హైదరాబాద్ లో ఆమె ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేదట. అర్థ రూపాయి మిగల్చడం కోసం అనసూయ పక్క స్టాఫ్ కి నడిచి వెళ్లి బస్సు ఎక్కేదట.

అలాంటి అనసూయ ఇప్పుడు ఖరీదైన కార్లలో తిరుగుతుంది. కోట్ల రూపాయలకు అధిపతి అయ్యింది. తాజాగా హైదరాబాద్ లో ఓ లగ్జరీ హౌస్ కొనుగోలు చేసింది అనసూయ. ఇటీవల గృహప్రవేశం చేశారు. ఆ ఇంట్లో నాలుగు బెడ్ రూమ్ లు, పెద్ద హాలు, కిచెన్, థియేటర్ తో పాటు అత్యాధునిక వసతులు ఉన్నాయట. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ కలిగి ఉందట. ఒక అంచనా ప్రకారం ఆ ఇంటి ధర రూ. 50 కోట్లు అట. అంటే ఒక స్టార్ హీరో నివసించే స్థాయి ఇంటిని అనసూయ నిర్మించుకుంది. మరి ఇంటి కోసమే అన్ని కోట్లు అనసూయ వెచ్చించింది అంటే.. ఆమెకు వద్ద వంద కోట్లకు పైగా ఆస్తులు ఉండే అవకాశం కలదనే ప్రచారం జరుగుతుంది.

అనసూయ నటిగా బిజీ అయ్యింది. ఆమెకు దర్శక నిర్మాతలు విలక్షణ పాత్రలు ఆఫర్ చేస్తున్నారు. ఒక్కో కాల్ షీట్ కి అనసూయ రూ. 2-3 లక్షలు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. కొన్నాళ్ళు బుల్లి తెరకు దూరమైన ఆమె తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2లో అనసూయ జడ్జిగా వ్యవహరిస్తోంది. సినిమాలు, టెలివిజన్ షోల ద్వారా ఆమెకు లక్షల సంపాదన దక్కుతుంది. అదే సమయంలో ప్రమోషన్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ ద్వారా మరింత ఆదాయం ఆమె ఆర్జిస్తోంది. మొత్తంగా అనసూయ నెల సంపాదన కోట్లకు చేరింది.

అనసూయకు సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అదే సమయంలో వ్యతిరేకత కూడా ఉంది. అనసూయ తరచుగా ట్రోలింగ్ కి గురవుతుంది. తనను విమర్శించే వారు మరింత కుళ్ళుకునేలా అనసూయ పోస్ట్స్ ఉంటాయి. ఒకరి కోసం నేను బ్రతకను, నాకు నచ్చినట్లు ఉంటాను అని అనసూయ నేరుగా చెబుతుంది. తన డ్రెస్సింగ్ పై ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ పట్టించుకోలేదు.

RELATED ARTICLES

Most Popular