Anasuya Bharadwaj: ఒకప్పటి యాంకర్ నేటి యాక్టర్ అనసూయ కెరీర్ కెరీర్ మూడు పూలు ఆరు కాయలుగా ఉంది. బుల్లితెరకు దూరమైన అమ్మడు వెండితెరపై సత్తా చాటుతుంది. జబర్దస్త్ వేదికగా అనసూయ పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగు యాంకరింగ్ కి గ్లామర్ యాంగిల్ పరిచయం చేసింది. అనసూయ ముందు తరం యాంకర్స్ ఎవరూ పొట్టిబట్టల్లో స్కిన్ షో చేసింది లేదు. అనసూయ తీరుపై ఒకింత విమర్శలు వినిపించాయి. కుటుంబ సభ్యులు కలిసి చూసే టెలివిజన్ షోలలో ఎక్స్పోజింగ్ ఏంటంటూ కొందరు మండిపడ్డారు. అనసూయ మాత్రం తన చర్యను సమర్థించుకుంది.
అనసూయ డ్రెస్సింగ్ పై ఎవరు మాట్లాడినా ఆమె ఫైర్ అవుతారు. నా బట్టలు నా ఇష్టం. నన్ను జడ్జ్ చేయడానికి మీరెవరు? నాకు కంఫర్ట్ అనిపిస్తే ఎలాంటి బట్టలైనా వేసుకుంటాను అంటుంది. అనసూయ ఇటీవల బికినీ కూడా వేయడం విశేషం. మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం అనసూయ వెకేషన్ కి వెళ్లారు. అక్కడ బీచ్ లో బికినీ ధరించి హొయలు పోయింది. సదరు బోల్డ్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అయ్యాయి.
తాజాగా ఆమె షర్ట్, టోర్న్ ప్యాంటు ధరించి సూపర్ స్టైలిష్ గా దర్శనమిచ్చింది. పెదకాపు 1 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అందరి దృష్టి అనసూయపై పడింది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన పెదకాపు సెప్టెంబర్ 29న విడుదల కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. చిత్ర యూనిట్ తో పాటు అనసూయ కూడా పాల్గొంది. పెదకాపు మూవీలో అనసూయ కీలక రోల్ చేశారు. ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ ఏడాది అనసూయ రంగమార్తాండ, విమానం చిత్రాలతో అలరించారు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ చిత్రంలో అనసూయ మోడరన్ కోడలు పాత్ర చేశాడు. ఇక విమానం మూవీలో వేశ్యగా నటించి మెప్పించింది. ఇలాంటి బోల్డ్ రోల్స్ చేయాలంటే ఎవరైనా సంకోచిస్తారు. యాటిట్యూడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అనసూయ మాత్రం అవలీలగా చేసేసింది. అనసూయ ఖాతాలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. ఆగస్టు వచ్చే ఏడాది 15న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.
View this post on Instagram