https://oktelugu.com/

Anasuya Bharadwaj: వైరల్ : రకరకాలుగా అందాలను వెదజల్లుతున్న అనసూయ

Anasuya Bharadwaj: ఆల్ టైమ్ బ్యూటీ ‘అనసూయ’కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎవరు ఏమనుకున్నా యాంకర్ల మూస ధోరణికి మంగళం పాడిన మొట్టమొదటి యాంకర్ ‘అనసూయ భరద్వాజ్’ మాత్రమే. అందాల ప్రదర్శనతో పైకి వచ్చింది అని ఆమె పై కామెంట్స్ చేసినా.. యాంకరింగ్ లో ఆమె కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. పైగా యాంకరింగ్ కి మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకతన సాధించింది. బాగా […]

Written By:
  • Shiva
  • , Updated On : March 30, 2022 / 12:32 PM IST
    Follow us on

    Anasuya Bharadwaj: ఆల్ టైమ్ బ్యూటీ ‘అనసూయ’కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎవరు ఏమనుకున్నా యాంకర్ల మూస ధోరణికి మంగళం పాడిన మొట్టమొదటి యాంకర్ ‘అనసూయ భరద్వాజ్’ మాత్రమే. అందాల ప్రదర్శనతో పైకి వచ్చింది అని ఆమె పై కామెంట్స్ చేసినా.. యాంకరింగ్ లో ఆమె కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. పైగా యాంకరింగ్ కి మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకతన సాధించింది.

    Anasuya Bharadwaj

    బాగా నటిస్తే ప్రత్యేకత ఎవరికైనా వస్తోంది. కానీ, ఫుల్ డిమాండ్ మాత్రం కొందరికే దక్కుతుంది. అనసూయకు ఆ రెండు దక్కాయి. మొత్తమ్మీద క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ మెయిన్ క్యారెక్టర్ లు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. పైగా అనసూయ ఫోటోషూట్ లు కూడా బాగా కవ్వించేలా ఉంటాయి.

    Anasuya Bharadwaj

     

    Anasuya Bharadwaj

    ఆ ఫోటోలు చూసే సోషల్ మీడియాలో అనసూయకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. నిత్యం మేకప్ తో అందాంగా కనిపించే అనసూయ.. అసలు చీరలో ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా ? అయితే.. ఒక లుక్కేయండి.

    Anasuya Bharadwaj

     

    Anasuya Bharadwaj

    ఎలాంటి మేకప్ లేకుండా అనసూయ పిజ్జా తింటూ కనిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ కింద ఫోటో చూడండి. ఏది ఏమైనా ఫుల్ గ్లామరస్ యాంకర్ గా పేరు ప్రఖ్యతాలు తెచ్చుకున్న అనసూయ ఇలా సడెన్ గా అసలు మేకప్ లేకుండా కనిపించడం అంటే ఎంతో దైర్యం కావాలి.

    మీకు తెలుసా ? అనసూయను చూసి చాలామంది అమ్మాయిలు ప్రస్తుతం యాంకరింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. అలా అడుగులు వేస్తోన్న అందరూ అనసూయలా అయిపోవాలని కలలు కంటున్నారు.

    ముఖ్యంగా ఆడియో ఫంక్షన్స్ లో యాంకరింగ్ చేయడానికి చాలామంది పోటీ పడుతున్నారు. అలాగే జబర్దస్త్ లాంటి ఫుల్ ఫాలోయింగ్ ఉన్న స్టేజ్ ల పై కూడా తమ అందాల మాటలతో గారడీ చేయడానికి వర్ణమాన యాంకర్లు తెగ ఉబలాట పడుతున్నారు అంటే కారణం.. ఆల్ టైమ్ హాట్ బ్యూటీ అనసూయనే కారణం.

    Anasuya Bharadwaj

    ‘జబర్థస్త్’ యాంకర్‌ గా తన అందచందాలతో ప్రేక్షకులను అలరించిన అనసూయ గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు మీ కోసం..
    అనసూయ సొంతూరు నల్లగొండ జిల్లా భూదాన్‌ పోచంపల్లి.

    Anasuya Bharadwaj

    అనసూయ మే 15,1985లో పుట్టింది. మొదట అనసూయ అమ్మగారు ఆమెకు పవిత్ర అని పేరు పెట్టాలని ఆశ పడిందట. అయితే అనసూయ తండ్రి వాళ్ల అమ్మగారి పేరు అయిన ‘అనసూయ’ పేరునే, తన కూతురికి పెట్టాలని పట్టుబట్టి అనసూయ అని పేరు పెట్టారు.

    Anasuya Bharadwaj

    చిన్నతనంలో అనసూయ కుటుంబం ఆర్థికంగా బాగుండేది. అయితే అనసూయ తండ్రికి గుర్రెపు పందెల వ్యసనం ఉండేది. ఆ వ్యసనం కారణంగా అనసూయ ఫ్యామిలీ ఆస్తులన్ని పోగొట్టుకుని చాల కష్టాలు పడ్డారు.

    Anasuya Bharadwaj

    అనసూయ అమ్మగారు కుట్టు మిషన్‌ కుడుతూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేవారంటేనే.. వాళ్ళ ఫ్యామిలీ ఎంతగా ఇబ్బందులు పడిందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే చిన్నతనం నుండే అనసూయ బాగా చదివేది. ఎంబీఏలో హెచ్‌ఆర్‌ కూడా చేసింది. తొలుత ఓ బ్యాంకులో టెలీకాలర్‌ గా కూడా పనిచేసింది.

    Anasuya Bharadwaj

    అన్నట్టు ఆమె ఆ బ్యాంక్ లో పని చేసే సమయంలో, ఆమె జీతం రూ. 5 వేలు. ఆ ఐదు వేలు నుండి మొదలైన అనసూయ ప్రస్థానం, ఇప్పుడు రోజుకు లక్షల రూపాయలు తీసుకునే స్థాయికి వచ్చింది.

    Anasuya Bharadwaj

    ఇక అనసూయ యాంకర్ గా మారకముందు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌ గా కూడా కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసింది. ఆ సమయంలోనే దర్శకుడు సుకుమార్ ఆమెను చూసి తన సినిమాలో అవకాశం ఇస్తానని ఆఫర్ ఇచ్చాడట. అయితే ఆమె యాంకర్ గా మారిన తరువాతే, ఆమె నటిగా టర్న్ తీసుకుంది.

    Anasuya Bharadwaj

    Tags