RRR 5th Day Collections: అదే విజృంభణ.. బాక్సాఫీస్ ను తొక్కుకుంటూ పోయింది

RRR 5th Day Collections: విపరీతమైన అంచనాల మధ్య విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి ట్రేడ్ పండితులు కూడా షాక్ అవుతున్నారు. హాలీవుడ్ సినిమా స్థాయిలో ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయా ? అంటూ సినిమా విశ్లేషకులు సైతం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. రోజురోజుకు వందల కోట్లు కలెక్ట్ చేస్తూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దూసుకుపోతుంది. ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం.. టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే.. ఫస్ట్ డే 203.07 కోట్లు కలెక్ట్, సెకండ్ […]

Written By: Shiva, Updated On : March 30, 2022 11:41 am
Follow us on

RRR 5th Day Collections: విపరీతమైన అంచనాల మధ్య విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి ట్రేడ్ పండితులు కూడా షాక్ అవుతున్నారు. హాలీవుడ్ సినిమా స్థాయిలో ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయా ? అంటూ సినిమా విశ్లేషకులు సైతం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. రోజురోజుకు వందల కోట్లు కలెక్ట్ చేస్తూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దూసుకుపోతుంది.

RRR 5th Day Collections

‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం.. టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే.. ఫస్ట్ డే 203.07 కోట్లు కలెక్ట్, సెకండ్ డే 135.50 కోట్లు, మూడో రోజు 275.81 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే నాలుగో రోజు 315.58 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఐదో రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం.

Also Read: RRR Movie Child Artist Malli Real Name: ఆర్ఆర్ఆర్ చిత్రంలో చిన్నారి మల్లి పాత్ర చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

నైజాం 65.70 కోట్లు

సీడెడ్ 33.90 కోట్లు

ఉత్తరాంధ్ర 19.72 కోట్లు

ఈస్ట్ 10.82 కోట్లు

వెస్ట్ 09.97 కోట్లు

గుంటూరు 13.83 కోట్లు

కృష్ణా 10.56 కోట్లు

నెల్లూరు 07.58 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని ఐదు రోజులకు గానూ 170.88 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ గా చూసుకుంటే 250 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

తమిళ నాడు : 21.77 కోట్లు

కేరళ : 09.78 కోట్లు

కర్ణాటక : 26.67 కోట్లు

నార్త్ ఇండియా (హిందీ) : 52.42 కోట్లు

ఓవర్సీస్ : 74.15 కోట్లు

రెస్ట్ : 09.91 కోట్లు

మొత్తం ఐదు రోజులకు గానూ టోటల్ వరల్డ్ వైడ్ గా 350.58 కోట్లు కలెక్ట్ చేసింది. గ్రాస్ గా చూసుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 600 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

RRR 5th Day Collections

ఒక తెలుగు సినిమా ఐదో రోజు కలెక్షన్స్ లో కూడా ఈ రేంజ్ ఫిగర్ ను నెలకొల్పడం సరి కొత్త రికార్డ్. హాలీవుడ్ భారీ సినిమాలకు వచ్చిన రేంజ్ లో.. ఐదో రోజు కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ రావడం తెలుగు సినీ ఇండస్ట్రీకే గర్వకారణం. ఇలాంటి భారీ మల్టీస్టారర్ సినిమా అంటే.. అది అమెరికా అయినా, అనకాపల్లి అయినా ఫ్యాన్స్ కు అదో పెద్ద పండుగే. ప్లేస్ ఎక్కడైనా ఆడియన్స్ ఎవరైనా థియేటర్స్ వద్ద కోలాహలం భారీ స్థాయిలో ఉంటుంది.

ఇక అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.498 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. నేటి వరకు చూసుకుంటే.. ఈ చిత్రం రూ.350.58 కోట్ల భారీ షేర్ ను సాధించింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.600 కోట్లను కలెక్ట్ చేసింది. ఓవరాల్ ఈ సినిమాకి భారీ లాభాలు రాబోతున్నాయి.

Also Read: RRR: బాహుబలికి ఉన్న ఊపు ‘ఆర్ఆర్ఆర్’కు ఎందుకు లేదు?

Tags