Anasuya Bharadwaj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చి సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న క్యారెక్టర్లు మరొకెత్తుగా మారబోతున్నాయి. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో ఆమె పోషించిన రంగమ్మత్త క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి… ఇక సినిమా చేసినప్పటి నుంచి ఆమెకి వరుసగా అవకాశాలైతే వచ్చాయి. దాంతో వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టుగా వాడుకుంటూ ఆమె మంచి నటిగా గుర్తింపును సంపాదించుకుంది.
ప్రస్తుతం ఆమె భారీ రెమ్యూనరేషన్ ను ఛార్జ్ చేసే ఒక నటిగా గుర్తింపును సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు… మంచి క్యారెక్టర్లు దొరికినప్పుడు సినిమాలు చేస్తూనే అడపదడప యాంకర్ గా కూడా రానిచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా అనసూయ మీద కూడా చాలా వరకు దగ్గర ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి. ఆమె ఏది చేసిన దాన్ని జనాలు ట్రోల్ చేస్తూనే ఉంటారు.
ఇక తను మొదట నాగ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించింది అంటూ ట్రోల్ చేశారు. దానిమీద రీసెంట్ గా స్పందిస్తూ నేను నాగ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించలేదు. షూటింగ్ జరుగుతున్న దగ్గరికి మా కాలేజీలో ఉన్న చాలామంది స్టూడెంట్స్ కలిసి వెళ్ళాము. అక్కడ మమ్మల్ని నిల్చోమని చెబితే అనుకోకుండా నేను అలా వెనకాల నిలుచున్నాను. దాంతో నేను స్క్రీన్ మీద కనిపించాను అంతే తప్ప నేను జూనియర్ ఆర్టిస్ట్ గా మాత్రం వెళ్లలేదు అంటూ ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
మొత్తానికైతే అనసూయ మొదట నాగ సినిమాలో కనిపించిందంటూ గతంలో చాలా రోజుల నుంచి చాలా రకాల వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికైతే ఆమె అనుకోకుండా అలా నటించాల్సి వచ్చిందని చెప్పింది. అలాగే తను టీవీ యాంకర్ గా మారి ఆ తర్వాత అఫీషియల్ గా స్క్రీన్ మీద కనిపించే స్థాయి కి ఎదిగినందుకు తను చాలా సంతోష పడుతున్నానని చెప్పడం విశేషం…