Anasuya Bharadwaj : గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడి. అందు కోసం నటులు చాలా కష్టపడతారు. కడుపు మాడ్చుకుని ఆహార నియమాలు పాటిస్తారు. కఠిన వ్యాయామాలు చేస్తారు. యోగాను అభ్యసిస్తారు. షేప్ అవుట్ అయితే దర్శక నిర్మాతలు పట్టించుకోరు. పక్కన పెట్టేస్తారు. నటులకు ఫిట్నెస్ చాల అవసరం. ఏజ్ పెరిగే కొద్దీ శరీరం పట్టుకోల్పోతుంది. అలా జరగకుండా ఉండాలంటే వ్యాయాయం తప్పనిసరి. చిన్న వయసులోనే వివాహం చేసుకున్న అనసూయకు ఇద్దరు కుమారులు. నాలుగు పదుల వయసుకు ఆమె దగ్గరైంది.
ఆ వయసులో ఫిట్ అండ్ స్లిమ్ గా కనిపించాలి అంటే వ్యాయామం చేయక తప్పదు. అందుకే క్రమం తప్పకుండ అనసూయ జిమ్ చేస్తుంది. తాజాగా తన ఇంటి అవసరణలో వర్క్ అవుట్స్ చేస్తున్న వీడియోను అనసూయ షేర్ చేసింది. జిమ్ ఫిట్ లో చెమటలు పట్టిస్తున్న అనసూయ వీడియో వైరల్ అవుతుంది. అందం కోసం అనసూయ చాలా కష్టపడుతుందని.. అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ ప్రతి విషయాన్ని షేర్ చేస్తారు.
Also Read : అనసూయ రోజుకి ఎంత తీసుకుంటుందో తెలుసా? ఆ సినిమాకు కెరీర్ హైయెస్ట్, మైండ్ బ్లోయింగ్ డిటైల్స్
ఇక అనసూయ కెరీర్ పరిశీలిస్తే… జబర్దస్త్ యాంకర్ గా ఏళ్ల తరబడి బుల్లితెర ఆడియన్స్ ని అలరించింది అనసూయ. 2022లో ఆ షోకి గుడ్ బై చెప్పింది. కొన్నాళ్ళు టెలివిజన్ షోలకు దూరంగా ఉంది. యాంకరింగ్ మానేసింది. ఆమెకు సినిమా ఆఫర్స్ విరివిగా వస్తున్న నేపథ్యంలో యాంకరింగ్ పై దృష్టి తగ్గించింది. ఇటీవల కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ షోకి శేఖర్ మాస్టర్ తో పాటు అనసూయ జడ్జిగా వ్యవహరించింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 త్వరలో ప్రారంభం కానుంది. ప్రోమో కూడా విడుదల చేశారు.
మరోవైపు బిజీ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆమె దూసుకుపోతుంది. అనసూయ పారితోషికం కూడా పెంచారని సమాచారం. గతంలో కాల్ షీట్ కి రూ. 1 లక్ష తీసుకునేదట. తాజాగా రూ. 2-3 లక్షలు డిమాండ్ చేస్తుందని సమాచారం. జబర్దస్త్ ఆమె ఫేట్ ని మార్చేయగా, భారీగా ఆర్జిస్తోంది. అనసూయ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పెదకాపు ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో అనసూయ నటిస్తుందట. ఈ చిత్రానికి గాను అనసూయ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాలీవుడ్ టాక్.
Also Read : అనసూయ రోజుకి ఎంత తీసుకుంటుందో తెలుసా? ఆ సినిమాకు కెరీర్ హైయెస్ట్, మైండ్ బ్లోయింగ్ డిటైల్స్