Anasuya Bharadwaj : తలక్రిందులుగా అనసూయ ఫీట్లు… స్టార్ యాంకర్ కి ఎంత కష్టం వచ్చింది! వైరల్ పిక్స్

దీనికి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. తలక్రిందులుగా ఏరియల్ యోగ చేస్తున్న అనసూయ పిక్ ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. అనసూయకు అందం కోసం ఎంత కష్టం వచ్చి పడిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనసూయ నెక్స్ట్ పుష్ప 2 మూవీలో సందడి చేయనుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అనసూయ దాక్షాయణిగా నెగిటివ్ రోల్ చేస్తుంది. అనసూయకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగానే ఉందట.

Written By: NARESH, Updated On : November 29, 2023 8:43 pm
Follow us on

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ టాలీవుడ్ బిజీ యాక్ట్రెస్ గా ఉంది. ఏడాదికి అరడజను సినిమాల వరకు చేస్తుంది. 2023లో అనసూయ నటించిన మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం వంటి చిత్రాలు విడుదలయ్యాయి. అనసూయ విలక్షణ పాత్రలతో మెప్పిస్తుంది. మరి ఈ పాత్రకైనా సిద్ధంగా ఉండాలంటే ఫిట్ గా ఉండాలి. నటులు స్లిమ్ అండ్ గ్లామరస్ గా ఉన్నప్పుడే ఆఫర్స్ వస్తాయి. అందుకే వయసు పెరుగుతుందంటే సెలెబ్స్ తెగ ఫీలైపోతారు.

అనసూయ కూడా వయసును తగ్గించుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. అనసూయకు పెళ్ళై పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో అనసూయ కొంచెం బొద్దుగా తయారయ్యారు. 38 ఏళ్ల అనసూయను హేటర్స్ ఆంటీ అని ట్రోల్ చేస్తుంటారు. అనసూయ ఇకపై బరువు పెరగకుండా అనసూయ రోజూ వ్యాయామం చేస్తుంది. డైట్ ఫాలో అవుతుంది. ఇవి సరిపోవడం లేదని కొత్తగా ఏరియల్ యోగ స్టార్ట్ చేసింది.

దీనికి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. తలక్రిందులుగా ఏరియల్ యోగ చేస్తున్న అనసూయ పిక్ ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. అనసూయకు అందం కోసం ఎంత కష్టం వచ్చి పడిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనసూయ నెక్స్ట్ పుష్ప 2 మూవీలో సందడి చేయనుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అనసూయ దాక్షాయణిగా నెగిటివ్ రోల్ చేస్తుంది. అనసూయకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగానే ఉందట.

అనసూయ ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తుంది. ఆమె పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తుంది. వ్యాపారులు అనసూయతో తమ షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ విధంగా లక్షలు సంపాదిస్తుంది. యాంకరింగ్ మానేసిన అనసూయ పూర్తి దృష్టి నటనపై పెట్టింది. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని ఆమె తేల్చి చెప్పింది. రెండు వృత్తుల్లో కొనసాగడం వలన ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారని అనసూయ అభిప్రాయపడింది.