spot_img
Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj: బీచ్ లో పబ్లిక్ గా రొమాన్స్ చేసిన అనసూయ... క్రేజీ ఫోటోలు వైరల్!

Anasuya Bharadwaj: బీచ్ లో పబ్లిక్ గా రొమాన్స్ చేసిన అనసూయ… క్రేజీ ఫోటోలు వైరల్!

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం వెండితెర పై సత్తా చాటుతుంది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం ఆమెకు ఎంతో ఇష్టం. తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్స్ ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

అయితే తాజాగా అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి వెకేషన్ కి వెళ్ళింది. ఇద్దరు బీచ్ లో విహరిస్తూ కనిపించారు. కాగా వాలెంటైన్స్ డే సందర్భంగా తమ ప్రేమకు గుర్తుగా అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేశాడు. అనసూయతో రొమాంటిక్ గా ఉన్న ఫోటోలు పంచుకున్న సుశాంక్ .. ‘హే నిన్నే… ఐ లవ్ యూ’ అంటూ ఆమెను ట్యాగ్ చేశాడు. దానికి లవ్ యు మోర్ అని రిప్లై ఇస్తూ కామెంట్ చేసింది అనసూయ.

ఇది చూసిన నెటిజన్లు.. వావ్ మీరు రొమాంటిక్ కపుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా అనసూయ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె చదువుకునే రోజుల్లో సుశాంక్ భరద్వాజ్ పరిచయం అయ్యాడట. ముందుగా సుశాంక్ ప్రపోజ్ చేయగా అనసూయ రిజెక్ట్ చేసి ఏడాది పాటు దూరం పెట్టిందట. అనంతరం అతని ప్రేమను అంగీకరించిందట.
తొమ్మిదేళ్లు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా మొండిపట్టుతో అనసూయ ప్రేమ వివాహం చేసుకున్నారు.

సమయం దొరికినప్పుడల్లా భర్త, పిల్లలతో సరదాగా గడుపుతూ కుటుంబం పట్ల అనసూయ బాధ్యత ను చాటుకుంటుంది. ఇక అనసూయ అప్ కమింగ్ చిత్రాలు గమనిస్తే… పాన్ ఇండియా మూవీ పుష్ప 2 లో అనసూయ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే హైదరాబాద్ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన రజాకార్ చిత్రంలో ఓ పాత్ర చేసింది. రజాకార్ మార్చి 1న విడుదల కానుంది. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్ ఆమె చేతిలో ఉన్నాయి. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ షో తో రచ్చ చేస్తుంది.

Exit mobile version