Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాప్యులర్ యాంకర్ కమ్ యాక్ట్రెస్. జబర్దస్త్ వేదికగా ఆమె అనేక సంచలనాలు నమోదు చేసింది. చెప్పాలంటే తెలుగు యాంకరింగ్ లో ట్రెండ్ సెట్టర్. గ్లామర్ షో చేసిన మొదటి టాలీవుడ్ యాంకర్ ఆమె. జబర్దస్త్ లో అనసూయ ధరించే బట్టలపై తీవ్ర చర్చ నడిచింది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి వీక్షించే బుల్లితెర షోలలో ఇలాంటి బట్టలు ధరించడం ఏమిటని, సాంప్రదాయవాదులు మండిపడ్డారు.
ఈ విమర్శలను అనసూయ ఏనాడూ పట్టించుకుంది లేదు. పైగా నా బట్టలు నా ఇస్తూ అంటూ నేరుగా వారికి సమాధానం చెప్పింది. నాకు కంఫర్ట్ అనిపిస్తే ఎలాంటి దుస్తులైనా ధరిస్తాను. జడ్జి చేసే హక్కు ఎవ్వరికీ లేదని స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చిన సందర్భాలు అనేకం. జబర్దస్త్ షోతో తెచ్చిన పాపులారిటీతో అనసూయ నటిగా సెటిల్ అయ్యింది. నిజానికి అనసూయ చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ మూవీలో అనసూయ.. ఒక సీన్ లో స్టూడెంట్స్ గుంపులో ఒకరిగా కనిపిస్తుంది. హీరోయిన్ కావాలని ఆమె కోరుకున్నారు. అయితే న్యూస్ రిపోర్టర్ గా మారి, యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. జబర్దస్త్ సక్సెస్ కావడంతో అనసూయ స్టార్ అయ్యింది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ.. క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు.
ఆమె మాట్లాడుతూ.. నాకు కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఉన్నాయి. నటులు, దర్శకులు కమిట్మెంట్స్ అడిగారు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో చాలా అవకాశాలు కోల్పోయాను, అన్నారు. అయితే కమిట్మెంట్ అడిగిన వాళ్ళ మీద నేను కోప్పడను. నేను అలాంటి అమ్మాయిని కాదు. నాకు ఇష్టం ఉండదు అని సహనంగానే చెబుతాను. నేను నో చెప్పడంతో వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. వారు మరలా నాతో నార్మల్ గానే ఉంటారు. మానవ సంబంధాలు చాలా విలువైనవి. వాటిని సులభంగా తెంచుకోలేను, అన్నారు.
ఇక సోగ్గాడే చిన్ని నాయనా మూవీ సమయంలో హీరో నాగార్జున ఆడి కార్ ఇచ్చారన్న పుకార్లను ఆమె కొట్టిపారేశారు. మనం అందరం కష్టపడే తత్త్వం ఉన్న మనుషులం. అన్ని సాధించుకుంటాము. ఆ వార్తల్లో నిజం లేదని అనసూయ అన్నారు. అనసూయ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.