Donald Trump (2)
Donald Trump: డొనాల్డ్ ట్రంప్(Donald Trump)అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను చులకన చేస్తున్నాయి. ట్రంపరితనంతో అధ్యక్షుడు అమెరికా పరువు తీస్తున్నారు. మరోవైపు అమెరికా అద్బుతమైనపనితీరుతో ప్రపంచాన్ని శాశించే దిశగా అడుగులు వేస్తోంది. చైనా(Chaina)వ్యూహాలను అర్థం చేసుకునే పరిస్థితుల్లోనే ట్రంప్ మెల్లగా అగ్రరాజ్య హోదాను చైనా చైనాకు అందిస్తున్నారు. అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలగడం, ఇతర దేశాలపై పన్నులే వేస్తామని బెదిరించడం, మిత్ర దేశాలను ఆక్రమిస్తామని ప్రకటించడం.. సొంత దేశలో నిరుద్యోగాన్ని పెంచే చర్యలు చేపట్టడం ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేయడం ఇవన్నీ అమెరికా స్థాయిని దిగజారుస్తున్నాయి.
తిరోగమన నిర్ణయాలే
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు అన్నీ తిరోగమన నిర్ణయాలుగానే కనిపిస్తున్నాయి. తనతోపాటు జైలుకు వెళ్లిన వారిని వదిలి పెట్టడం, మెక్సికో నుంచి వలసలను అడ్డుకునేందుకు దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించడం, బైడెన్ హయాంలో తీసుకున్న 78 నిర్ణయాలను రద్దు రేయడం. జన్మతః పౌరసత్వం రద్దు చేయడం ఇలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక డబ్ల్యూహెచ్‌వోనుంచి తప్పుకున్నారు. పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు ఇలా అనేక అనాలోచిత నిర్ణయాలతో అమెరికాను తిరోగమన బాట పట్టిస్తున్నారు. ఆయన తీసుకున్న సగం నిర్ణయాలు అమెరికా రాజ్యాంగం ప్రకారం చెల్లవు. ఇక డబ్ల్యూహెచ్‌వో(WHO)నుంచి వైదొలగడం ఆయన చేసిన అతిపెద్ద తప్పు. బైడెన్(Biden)పాలనలో డబ్ల్యూహెచ్‌వోకు ఎక్కువ నిధులు ఇచ్చింది. దీంతో ప్రపంచ ఆరోగ్యంపైనా పట్టు సాధించినట్లయింది. కానీ, ట్రంప్ నిర్ణయంతో ఇప్పుడు ఆ దేశ పరువు పోయింది. దీంతో అమెరికా స్థానం ఆక్రమించేందుకు చైనా కాచుకు కూర్చుంది. డబ్ల్యూహెచ్‌వెకు నిధులు పెంచి నంబర్ వన్‌గా నిలవాలి భావిస్తోంది. దీంతో అమెరికా పెద్దన్న పాత్ర కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
పన్నులు పెంచితే అమెరికాకే నష్టం !
ఇక ట్రంప్ తమ దేశం నుంచి వచేచ ఉత్పత్తులకు ఎక్కువ పన్ను విధిస్తున్నారని ఆయా దేశాల నుంచి తమ దేశంలోకి వచ్చే వాటిపై ఎక్కువ పన్నులు వేస్తామని బెదిరిస్తున్నారు. దిగుమతులపై పన్నులు పెంచితే ఎగుమతులపై పన్నులు పెంచితే నష్టపోయేది అమెరికానే చాలా దేశాలు అమెరికాకు ప్రత్యామ్నాయం చూసుకుంటాయి . దీంతో ఆ దేశానికి నష్టం తప్పదు. ఇక అమెరికన్ల ఆదాయపు పన్ను రద్దు చేసి దానిని విదేశాల నుంచి వసూలు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. దీంతో అమెరికన్ల సంపద బాగా పెరుతుందన్న ఆలోచనలో ఉన్నారు. కానీ, అదే జరిగితే ఇటు దిగుమతులు తగ్గిపోయి.. అటు ఆదాయపు పన్ను లేక దేశం నిస్తేజం అవుతుంది.
ప్రభుత్వ ఉద్యోగులను పంపించాలని..
ఇక ట్రంప్ తాజాగా ప్రభుత్వ ఉద్యోగులపై పడ్డారు. ఎనిమిది నెలల జీతం ఇస్తాం అందరూ మానేయండి అని మెస్సేజ్ పెట్టారు. ప్రభుత్వ సమర్థత ఉద్యోగుల పనిమీద ఆధారపడి ఉంటుంది. వారు సరిగ్గా పనిచేయకపోతే మ్యాన్ పవర్ లేకపోతే అమెరికా నిస్తేజం అవుతుంది. కొత్తవారిని నియమించినా వారికి అనుభవం రావడానికి సమయం పడుతుంది.
చైనా దూకుడు..
అమెరికా వైఫల్యాలనే తన సక్సెస్ మంత్రంగా మార్చుకుంటోంది చైనా. సైలెంట్‌గా ఎదుగుతోంది. ట్రంప్ అధికారం చేపట్టగానే చైనా కొట్టిన దెబ్బకు ఆయన మైండ్ బ్లాంక్ అయింది. డీప్ సీక్ ఆవిష్కరించడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్ప కూలాయి. అమెరికా సున్నితమైన సంపద సృష్టించుకుంది. టెక్ పునాదుల మీద నిలబడిన ఆర్థిక సామ్రాజ్యం. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా లాంటివే అమెరికా ఆసుతలు. వాటిని క్పుకూల్చడం పెద్ద విషయం కాదు. వాటిని మించిన ప్రొడక్ట్స్ వస్తే అవి కుప్పకూలుతాయి. దీనికి సాక్షం డీప్‌సీక్. చాట్ జీపీటీని బీట్ చేసేలా డీప్‌సీక్‌ను చైనా డెవలప్ చేసింది. అది ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. ఇలాంటి బాంబులు చైనావద్ద అనేకం ఉన్నాయి. ఒక్కొక్కటిగా అమెరికాపై ప్రయోగించడం ఖాయం. తయారీ రగంలోనూ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేలా నిర్ణయాలు తీసుకుంటుంది. సూర్యుడికి ప్రత్యామ్నాయంగా మరో సూర్యుడిని తయారు చేస్తోంది చైనా. బీజింగ్ మొత్తం కరెంటు ఇచ్చేలా అతిపెద్ద సోలార్ వాల్ నిర్మిస్తోంది. ఇక బ్రహ్మపుత్ర నదిపై అతి పెద్ద డ్యామ్ కట్టబోతున్నారు.
ప్రపంచ దేశాలపై చైనా పట్టు..
మరోవైపు చైనా ప్రపంచ దేశాలపై పట్టు పెంచుకుంటోంది. రష్యాతోపాటు అనేక దేశాలతో స్నేహం పెంచుకుంటోంది. అమెరికా అవసరాలు ప్రపంచ దేశాలతో తీరిపోతే డాలర్ గురించి ఎవరూ పట్టించుకోరు. ఈ క్రమంలో చైనా వ్యూహాత్మకంగా డాలర్‌ను దాటిపోయేందుకు ప్రయత్నిస్తోంది. అనేక దేశాలపై తన ముద్ర ఉండేలా చూసుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు, యూరప్‌లోని చాలా దేశాలు చైనానే పెద్దన్నగా భావిస్తున్నాయి.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Donald trump is slowly giving superpower status to china
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com