Anasuya Bharadwaj: యాంకర్స్ అంటే అప్పటి వరకూ సాదా సీదాగానే ఉండేవాళ్లు. మోడ్రన్‌గా కనిపించినా అందాల ప్రదర్శన తక్కువే ఉండేది. కానీ బుల్లి తెరకు హాట్ నెస్ పరిచయం చేసి యాంకర్స్ అంటే హీరోయిన్స్‌కు మించి అనసూయ అనే చెప్పాలి. మొదట టీవీ 9లో యాంకర్ గా పనిచేసిన అనసూయ ఆ తరవాత జబర్దస్త్‌లో ఛాన్స్ దక్కించుకుంది. అసలు ఆమెకు న్యూస్ ప్రజెంటర్‌గా ఛాన్స్ రావడానికే చాలా కష్టాలు పడింది. ఎప్పుడు అయితే జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అసలు తెలుగు యాంకరింగ్ అన్న పదానికే ఆమె సరికొత్త నిర్వచనం చెప్పేసింది.

కుర్రాళ్ల మతిపోగొట్టేలా..
ఈ కామెడీ షోలో పొట్టి బట్టలతో కుర్రాళ్ల మతి పోగొట్టింది అనసూయ. ఆ షో లో వచ్చే కామెడీతో పాటు అనసూయ అందాలను ఎంజాయ్ చేయడం కూడా ప్రేక్షకులకు అలవాటు అయిపోయింది. అంతే కాకుండా స్కిట్ మధ్యలో డబుల్ మీనింగ్ పంచ్‌లు వేస్తూ ఆకట్టుకుంది. దాంతో అనసూయ క్రేజ్ యూత్‌లో పీక్స్ లోకి వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత జబర్దస్త్‌తోపాటు మరిన్ని టీవీ షోలలో కూడా సందడి చేసింది. అంతే కాకుండా క్షణం సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి మెప్పించింది. రీసెంట్ గా పుష్పతో కూడా మరో హిట్ అందుకుంది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉండటంతో జబరస్త్‌కు గుడ్‌బై చెప్పింది.

క్యాస్టింగ్ కౌచ్‌పై కామెంట్స్..
సినిమా ఇండస్ట్రీలో అనేకమంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నారు. దీనిపై అనసూయ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఇంటర్వ్యూ పాతదే అయినా ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో అనసూయ సంచలన కామెంట్స్ చేసింది. ‘ఎవరైనా రోల్ ఆఫర్ చేసి అడగకూడనిది అడిగితే.. ఆ పాత్ర వదులుకోడమే మంచిది. ఆ పాత్ర పోతే దానికి అమ్మ లాంటి పాత్ర వస్తుంది. ధైర్యంగా ఉండాలి’ అ ని చెప్పింది. తననూ అవకాశాల కోసం పిలిచారని చెప్పింది. అయితే తాను వెళ్లలేదని పేర్కొంది. ‘ధైర్యం లేని అమ్మాయిలే కాస్టింగ్ కౌచ్‌కు బలి అవుతున్నారు’ అని సంచలన నిజాలు బయటపెట్టింది. అయితే తనకూ ఆఫర్ ఇచ్చారని చెప్పిన అనసూయ ఆఫర్ ఇచ్చిన వ్యక్తి, లేదా వ్యక్తుల పేర్లు మాత్రం చెప్పడం లేదు. మొత్తాని క్యాసింగ్ కౌచ్ ఇండస్ట్రీలో కమాన్ అనే విషయాన్ని మాత్రం అంగీకరించింది. ధైర్యంగా ఉంటే దానిని ఎదుర్కొవచ్చని, ధైర్యం లేకపోతే బలి కాక తప్పదని స్పష్టం చేసింది.