Homeఎంటర్టైన్మెంట్Anasuya: రెడ్ శారీలో హాట్ లెక్చరర్ గా మారిన అనసూయ... వెర్రెత్తిపోయిన స్టూడెంట్స్!

Anasuya: రెడ్ శారీలో హాట్ లెక్చరర్ గా మారిన అనసూయ… వెర్రెత్తిపోయిన స్టూడెంట్స్!

Anasuya: బుల్లితెర మీద అనసూయ సందడి మరలా షురూ అయ్యింది. స్టార్ మా లో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోకి ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ కోసం ఆమె హాట్ లెక్చరర్ అవతారం ఎత్తింది. రెడ్ శారీ ధరించి గ్లామరస్ లుక్ లో మెస్మరైజ్ చేసింది. దాదాపు రెండేళ్లు బుల్లితెరకు దూరమైంది అనసూయ. మొదట జబర్దస్త్ నుంచి తప్పుకున్న ఆమె, మిగతా టెలివిజన్ షోస్ కి కూడా గుడ్ బై చెప్పింది. ఈ పరిణామం అనసూయ అభిమానులను నిరాశపరిచింది. ముఖ్యంగా జబర్దస్త్ లవర్స్ వేదన చెందారు.

మీరు తిరిగి బుల్లితెరకు రావాలని పలుమార్లు అనసూయను అభిమానులు రిక్వెస్ట్ చేశారు. అయినా అనసూయ మనసు కరగలేదు. బుల్లితెర షోల టీఆర్పీ స్టంట్స్ నాకు నచ్చడం లేదు. ఇకపై యాంకరింగ్ చేసేది లేదు. బుల్లితెరపై కనిపించడం జరగదని పరోక్షంగా చెప్పింది. ఆమె చేతినిండా సినిమా ఆఫర్స్ ఉన్న నేపథ్యంలో అనసూయ ఇలాంటి కామెంట్స్ చేసింది.

కారణం తెలియదు కానీ తన ఒట్టు గట్టు మీద పెట్టింది. బుల్లితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది. స్టార్ మా బుల్లితెర సెలెబ్రిటీలతో కిరాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ పేరుతో ఒక గేమ్ షో స్టార్ట్ చేసింది. శ్రీముఖి యాంకర్ గా ఉన్న ఈ షోకి శేఖర్ మాస్టర్ తో పాటు అనసూయ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్లో కాలేజ్ థీమ్ పెర్ఫార్మ్ చేశారు. ఈ క్రమంలో అనసూయ రెడ్ శారీ ధరించి హాట్ లెక్చరర్ గా పిచ్చ రేపింది. అనసూయ గ్లామర్ కి బుల్లితెర నటులు వెర్రెత్తిపోయారు.

కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. ఈ ప్రోమోలో రీతూ చౌదరి లవర్ నా మాజీ లవర్ అని విష్ణుప్రియ చెప్పడం చర్చకు దారి తీసింది. ఇక ప్రియాంక జైన్ ని అంబటి అర్జున్ ఎత్తి చంకన పెట్టుకున్నాడు. అనసూయ, శ్రీముఖి, శేఖర్ మాస్టర్ వంటి స్టార్స్ భాగమైన కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో కి అంతకంతకు ఆదరణ పెరుగుతుంది. భవిష్యత్తులో మంచి టీఆర్పీ రాబట్టే అవకాశం ఉంది..
Kiraak Boys Khiladi Girls - Full Promo | College Theme | Every Sat -Sun @ 9 PM | Star Maa

Exit mobile version